IPL 2022: ఈసారైనా ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే సత్తా ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 14 సీజన్‌లు పూర్తయ్యాయి. అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు టైటిల్ విజేతలుగా నిలిచినా బెంగళూరు జట్టుకు మాత్రం ఇంకా ఆ భాగ్యం దక్కలేదు. దీంతో ఈ సారైనా తమ జట్టు టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్న ఆర్‌సీబీ అభిమానులకు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన మాటలతో షాకిచ్చాడు.
ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవలేదని.. ఆ జట్టుకు అంత సీన్ లేదని ఆకాష్ చోప్రా తేల్చి చెప్పేశాడు. ఆ జట్టు కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరదని అంచనా వేశాడు. బెంగళూరు జట్టులోని మ్యాక్స్‌వెల్ మంచి ప్లేయర్ అయినా అతడిపై నమ్మకం ఉంచలేమన్నాడు. అతడు ఓ రిస్క్ ప్లేయర్ అని.. నిలకడగా ఆడతాడని కచ్చితంగా చెప్పలేమన్నాడు. డుప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మినహా ఆర్సీబీ జట్టులో మ్యాచ్ విన్నర్లు లేకపోవడం మైనస్ పాయింట్ అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. బౌలింగ్‌లో రాహుల్ చాహర్, చాహల్ వంటి ఆటగాళ్లను తీసుకోకుండా హసరంగాను ఎక్కువ ఖర్చు పెట్టి కొనుగోలు చేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. కాగా 15వ సీజన్ ఐపీఎల్‌లో ఆర్సీబీకి డుప్లెసిస్ సారథిగా వ్యవహరించనున్నాడు. కెప్టెన్ మారడంతో తమ జట్టు రాత కూడా మారుతుందని ఆర్సీబీ యాజమాన్యం ఆశిస్తోంది.
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
- Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
- Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!