NTV Telugu Site icon

Ravichandran Ashwin: 34 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టి.. చరిత్ర సృష్టించిన అశ్విన్‌

Ashwin Breaks 34 Years Reco

Ashwin Breaks 34 Years Reco

Ravichandran Ashwin Breaks 34 Years Old Record: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. 34 ఏళ్ల క్రితం నమోదైన అరుదైన రికార్డ్‌ని బద్దలుకొట్టి.. వరల్డ్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా అతడు ఈ ఘనతని సాధించాడు. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి అశ్విన్ (42 నాటౌట్) భారత ఇన్నింగ్స్‌ని ముందుకు సాగించాడు. చివరి వరకు అజేయంగా నిలిచి, జట్టుకి విజయాన్ని అందించాడు. ఇలా కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడు, తన పేరిట ఓ వరల్డ్ రికార్డ్‌ని నమోదు చేసుకున్నాడు.

MLAs Bribe Case: ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు ట్విస్ట్.. అందుకు గ్రీన్ సిగ్నల్

టెస్ట్ క్రికెట్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో.. తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ వెస్టిండీస్‌ ఆటగాడు విన్స్‌టన్ బెంజమిన్ పేరిట ఉండేది. 1988లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 40 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచి, తన జట్టుని గెలిపించుకున్నాడు. ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత్ ఆ రికార్డ్‌ని అశ్విన్ బద్దలుకొట్టాడు. కేవలం బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించడమే కాదు, బంతితోనూ అశ్విన్ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇలా బ్యాట్ & బాల్‌తో అశ్విన్ రప్ఫాడించడంతో.. అతనికి మ్యాన్ ఆఫ్ ద అవార్డ్ దక్కింది.

Kushi Re Release Trailer: నటించకు.. నువ్వు నా నడుము చూసావ్..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 145 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇది చాలా తక్కువ లక్ష్యం కావడంతో.. సునాయాసంగా మ్యాచ్‌ని భారతీయులు ముగిస్తారని అనుకున్నారు. కానీ.. టాపార్డర్ చేతులెత్తేయడంతో భారత కష్టాల్లో మునిగిపోయింది. అక్షర్ పటేల్ (34) ఊపిరి పోయగా.. చివర్లో అయ్యర్ (29), అశ్విన్ ఆదుకొని జట్టుని గెలిపించారు. వీరి పుణ్యమా అని.. భారత్ మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. ఫలితంగా.. 2-0 తేడాతో ఈ టెస్ట్ సిరీస్‌తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్