Site icon NTV Telugu

Ravi Shastri: కోహ్లీ, రోహిత్లను ఇబ్బంది పెట్టే వారికి రవిశాస్త్రి వార్నింగ్.. టార్గెట్ గంభీరేనా?

Ravi

Ravi

Ravi Shastri: టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌పై అనవసరంగా విమర్శలు చేస్తూ, వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతున్న వారికి భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ODI క్రికెట్‌లో కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో గొడవ పెట్టుకోవద్దని సూచించారు. వారి స్థాయిని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే తాను ఒప్పుకోబోమని టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి స్పష్టం చేశారు.

Read Also: Putin India Visit: పుతిన్ బస చేస్తున్న ‘‘ప్రెసిడెన్షియల్ సూట్’’ ఒక రోజు ఖర్చు ఎంతో తెలుసా..?

అయితే, కొంతమంది ఉద్దేశపూర్వకంగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీల భవిష్యత్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని రవిశాస్త్రి అన్నారు. ఈ ఇద్దరూ ఒకసారి సీరియస్‌గా మైదానంలోకి దిగితే, వారిని ఇబ్బంది పెట్టే వాళ్లందరూ మాయం అవుతారని హెచ్చరించారు. 2027 ODI వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ- రోహిత్ ఫ్యూచర్ ప్రణాళికలపై జరుగుతున్న చర్చల మధ్యలో రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Minister Atchannaidu: వైఎస్‌ జగన్‌కు అచ్చన్నాయుడు సవాల్‌.. చర్చకు సిద్ధమా..?

ఇక, డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ సూచనపై రోహిత్ శర్మ అంగీకరించినప్పటికీ, విరాట్ కోహ్లీ ఒకసారి నిరాకరించిన తర్వాత సెలెక్టర్ల ఒత్తిడితో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్‌, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లను టార్గెట్ చేస్తూ రవిశాస్త్రి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Exit mobile version