Ravi Shastri: ఎవరేమన్నా.. టీ20ల్లో నంబర్‌వన్ ఆటగాడు అతడే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరెన్ని వాదనలు చేసినా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్‌వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని.. తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నాడు. టీ20 ఫార్మాట్లో పాండ్యాకు తిరుగు లేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించినా.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో అంతగా రాణించలేకపోయాడు.
కాగా ఆసియాకప్‌లో అంతంత మాత్రంగానే పాండ్యా రాణించడంతో విమర్శకులు పెదవి విరిచారు. ఇలా ఆడితే టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడం కష్టమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసియా కప్‌కు ముందు పాండ్యా గాయపడి జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో విశేషంగా రాణించడంతో పాండ్యాను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ సిరీస్‌లలో అద్భుతంగా ఆడాడు. కానీ ఆసియా కప్‌లో జడేజా గైర్హాజరీ, పాండ్యా మోస్తరు ప్రదర్శన టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో విమర్శకులు దుమ్మెత్తి పోయడంతో తాజాగా రవిశాస్త్రి పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తాడు. కాగా భవిష్యత్‌లో తాను మరోసారి కోచ్ అవతారం ఎత్తే ప్రసక్తే లేదని రవిశాస్త్రి అన్నాడు. కోచ్‌గా తన కాలం ముగిసిపోయిందని.. భారత క్రికెట్‌కు ఎంత చేయాలో అంతా చేశానని తెలిపాడు. ఇకపై కోచింగ్ ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.
Also Read
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!