Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports R Ashwin Reaction On Sanju Samson T20 World Cup Performance Missing Centuries

Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?

Published Date :March 10, 2026 , 7:38 pm
By Shiva Ganesh
Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ashwin: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ వెన్నెముకగా నిలిచారు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైనా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చి సంచలన ఇన్నింగ్స్‌లతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టారు. అయితేవరల్డ్ కప్ హీరో సంజుపై అశ్విన్ కోపంగా ఉన్నారు. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో

సంజు విధ్వంసం.. అశ్విన్ విశ్లేషణ..
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, సంజు ఆటతీరును ప్రశంసిస్తూనే ఒక అభిమానిగా తన అసంతృప్తిని బయటపెట్టారు. “ఒక క్రికెటర్‌గా, బ్యాట్స్‌మన్‌గా సంజు ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేయాల్సింది. అతను వెస్టిండీస్‌పై 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు, కానీ ఒక అభిమానిగా అతను ఆ మూడు సెంచరీలు పూర్తి చేసి ఉండాలని కోరుకున్నాను. కేవలం 10 సింగిల్స్ తీసి ఉంటే అతను సులభంగా సెంచరీ మార్కును అందుకునేవాడు.” అని అశ్విన్ పేర్కొన్నారు. సంజు శామ్సన్ తన వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాడని అశ్విన్ కొనియాడారు. “సంజు ఎప్పుడూ తన కోసం ఆడడు. ఉద్దేశపూర్వకంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తాడు. సెంచరీ కోసం పాకులాడకుండా పెద్ద షాట్లు ఆడుతూ అవుట్ అవ్వడమే అతని ప్రత్యేకత. అదే అతడిని అందరికీ ఇష్టమైన ఆటగాడిగా మార్చింది. కానీ, అంత గొప్పగా ఆడి కూడా సెంచరీ సాధించలేకపోవడం నాకు బాధ కలిగిస్తోంది.” అని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రపంచకప్‌లో సంజు శామ్సన్ కేవలం 321 పరుగులు చేయడమే కాకుండా, అత్యంత కీలక సమయాల్లో రాణించారు. వెస్టిండీస్‌పై 97* పరుగులు చేసి భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చారు. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో 89 పరుగులతో భారీ స్కోరు అందించారు. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి 89 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆరంభంలో అవకాశాలు రాకపోయినా, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శామ్సన్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారారు.

READ ALSO: Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashwin comments on Sanju Samson centuries.
  • India T20 World Cup Victory 2026
  • R Ashwin on Sanju Samson YouTube
  • Sanju Samson 97 vs West Indies
  • Sanju Samson Player of the Tournament 2026

తాజావార్తలు

  • Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?

  • PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో

  • Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధంతో పుతిన్‌కు లాభం, రష్యాకు సంతోషం..

  • Gas Cylinder Update: అలర్ట్‌.. అలర్ట్‌.. ఈ-కేవైసీ లేకుంటే గ్యాస్ కట్..!

  • LPG Supply: గ్యాస్ సరఫరాపై మంత్రి టెలీకాన్ఫరెన్స్.. ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు

ట్రెండింగ్‌

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions