Top 5 Expensive Players in PSL 2026 Auction: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 మార్చి 26 నుంచి మే 3 వరకు షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే. 11వ సీజన్ ముందు లాహోర్‌లో పీఎస్ఎల్ వేలం జరిగింది. ఈ ఈవెంట్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని 8.65 PKR ( భారత కరెన్సీలో రూ.2.8 కోట్లు)కు రావల్పిండి ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం నసీమ్ షా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
వేలం కాకుండా నేరుగా సైన్ చేసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. అతడిని రూ.4.53 కోట్లకు సియాల్‌కోట్ జట్టు తీసుకుంది. ఇది డైరెక్ట్ సైనింగ్ కేటగిరీలో అత్యధిక ధరగా నిలిచింది. వేలంలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో నసీమ్ షా తర్వాత ఫహీమ్ అష్రఫ్ రూ.2.75 కోట్లు, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ రూ.2.61 కోట్లు, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ రూ.2.57 కోట్లు, ఆస్ట్రేలియా వెటరన్ డేవిడ్ వార్నర్ రూ.2.56 కోట్లతో నిలిచారు.
Also Read: Aiden Markram Reaction: ఓ పక్క సుస్సు పడింది.. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ ఆడలేదు!
డైరెక్ట్ సైనింగ్:
స్టీవ్ స్మిత్ (₹ 4.53 CR)
వేలంలో టాప్ 5 ప్లేయర్స్ లిస్ట్”
నసీమ్ షా (₹ 2.8 CR)
ఫహీమ్ అష్రఫ్ (₹ 2.75 CR)
డారిల్ మిచెల్ (₹ 2.61 CR)
ఫఖర్ జమాన్ (₹ 2.57 CR)
డేవిడ్ వార్నర్ (₹ 2.56 CR)
