Site icon NTV Telugu

Telangana Youth Congress: HCA పై మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ ల వత్తిడి

Telangana Youth Congress

Telangana Youth Congress

Pressure of Ministers KTR and Srinivas Goud on HCA: మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ లు HCA పై ప్రెషర్స్ చేశారని జాతీయ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగే ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ గురించి హెచ్ సీఏ కి, ప్రభుత్వంకి తెలుసని మండిపడ్డారు. ఇంత పెద్ద మ్యాచ్ కి టికెట్ల ఇష్యూ జింఖాన గ్రౌండ్ లో జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు బందోబస్తు కల్పించాల్సింది పోయి, HCA అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ లు HCA పై వత్తిడి చేసారని తీవ్ర విమర్శలు చేసారు. ఈ ప్రెషర్స్ వల్లే టికెట్స్ మొత్తం బ్లాక్ లిస్ట్ అయ్యాయని తెలిపారు.

అధికారులు తమ ఫిషి నుండి కూడా టికెట్స్ కోసం కాల్ చేశారని ఆరోపించారు. గాయపడ్డ బాధితులకు చికిత్స కోసం ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదని అన్నారు. మేము స్వయంగా బాధితుల దగ్గరకు వెళ్లి మాట్లాడటం జరిగిందని తెలిపారు. టికెట్ల గందరగోళం బాధ్యత ప్రభుత్వం వహించాలని డిమాండ్‌ చేశారు. గాయపడ్డ బాధితులకు చికిత్స అందిచాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వం దే అన్నారు. ఘటనపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మేము ఏ కార్యక్రమం చేపట్టిన పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తారు, మా మీద దృష్టి పెట్టిన పోలీసులు మ్యాచ్ పై ఎందుకు ఫోకస్ చేయలేదని జాతీయ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ మండిపడ్డారు.
TTD Board Meeting: ముగిసిన టీటీడీ పాలకమండలి భేటీ.. ఆస్తులపై శ్వేతపత్రం విడుదల

Exit mobile version