ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ డిసైడర్ కు సర్వం సిద్ధమవుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మార్చి 9 ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా ఫైనల్ లో గెలిచి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టిన కివీస్ ఛాంపియన్ ట్రోఫీపై కన్నేసింది. కాగా ఫైనల్ మ్యాచ్ కోసం పిచ్‌ను ఎంపిక చేశారు. భారత్ విక్టరీ కొట్టిన పిచ్ పైనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది.
Also Read:NTV Exclusive: శ్రీకాంత్ మళ్ళీ భయ పెడతాడట!
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం సెంటర్-వికెట్‌ను ఉపయోగించనున్నారు. టోర్నమెంట్ గ్రూప్ దశలో హై ప్రొఫైల్ ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉపయోగించిన వికెట్ ఇదే. భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఈ పిచ్‌పై జరుగబోతోంది. ఇదే గ్రౌండ్ లో గ్రూప్-దశ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఈ పిచ్‌పై భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కలిసి ఐదు వికెట్లు పడగొట్టారు.
Also Read:RK Roja: చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!
ప్రస్తుత టోర్నమెంట్‌లో దుబాయ్‌లోని పిచ్‌లు బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్లకే ఎక్కువ అనుకూలిస్తున్నాయి. దుబాయ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో సగటు స్కోరు 246. ఇందులో భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 264 పరుగులు చేసింది. 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 49వ ఓవర్లోనే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్‌లో నాలుగు వేర్వేరు పిచ్‌లను ఉపయోగించింది. మధ్యలో ఉన్న నాలుగు పిచ్‌లలో ఒకదాన్ని ఫైనల్ కోసం ఉపయోగిస్తారు.
Also Read:Air Force chief: ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాగా F-35 జెట్‌లను కొనలేము..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్.
Also Read:Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్.. షారూఖ్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు..
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.