Asia Cup 2023: ఆసియా కప్ 2023.. మాట మార్చిన పీసీబీ కొత్త ఛైర్మన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB New Chairman Zaka Ashraf Says Will go with ACC decision on Asia Cup 2023: ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కొత్త ఛైర్మన్ జకా అష్రాఫ్ తన మాటలను భలేగా మారుస్తున్నాడు. 2023 ఆసియా కప్ నిర్వహణ కోసం మాజీ పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించేది లేదని చెప్పిన జకా అష్రాఫ్.. 24 గంటలు గడవకముందే తన మాట మార్చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం మేరకు ముందుకు వెళ్తానని తాజాగా ప్రకటించాడు. ఆసియా కప్ మ్యాచ్‌ల నిర్వహణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. దీంతో ఆసియా కప్ నిర్వహణపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది.
‘హైబ్రిడ్ మోడల్‌ను నేను వ్యతిరేకించా. దేనివల్ల పాకిస్తాన్ క్రికెట్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని నేను భావిస్తున్నా. అందుకే హైబ్రిడ్ మోడల్ నాకిష్టం లేదు. అతిథ్య దేశంగా టోర్నీ నిర్వహణ ద్వారా పాకిస్థాన్‌కు ప్రయోజనాలు దక్కాలి. శ్రీలంకకు ఎక్కువ మ్యాచ్‌లను కేటాయించడం నాకు నచ్చలేదు. అయితే టోర్నీ నిర్వహణలో ఏసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఏసీసీ ప్రకారమే ముందుకు వెళ్తాం. ఏసీసీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. ఇప్పటినుంచి అయినా మేం మా దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం ఉండేలా చూసుకుంటాం’ అని జకా అష్రాఫ్ చెప్పినట్టు ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.
Also Read
మొన్నటివరకు పీసీబీ తాత్కాలిక ఛైర్మన్ పదవిలో ఉన్న నజమ్ సేథీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో కొత్త ఛైర్మన్‌గా జకా అష్రాఫ్ బాధ్యతలు అందుకోనున్నాడు. ఇక ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ 2023 జరగనుంది. ఆసియా దేశాలు ఏ టోర్నీలో పాల్గొననున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ ఆసియా కప్ 2023లో తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్, నేపాల్ గ్రూప్-1లో.. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక గ్రూప్-2లో ఆడనున్నాయి.
Also Read: Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. సూపర్ లుకింగ్, బెస్ట్ ఫీచర్స్!
- Tags
- ACC
- Asia Cup 2023
- bcci
- pcb
- Zaka Ashraf
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!