NTV Telugu Site icon

Asia Cup 2023: ఆసియా కప్‌ 2023.. మాట మార్చిన పీసీబీ కొత్త ఛైర్మన్‌!

Zaka Ashraf

Zaka Ashraf

PCB New Chairman Zaka Ashraf Says Will go with ACC decision on Asia Cup 2023: ఆసియా కప్‌ 2023 టోర్నీ విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కొత్త ఛైర్మన్‌ జకా అష్రాఫ్‌ తన మాటలను భలేగా మారుస్తున్నాడు. 2023 ఆసియా కప్‌ నిర్వహణ కోసం మాజీ పీసీబీ ఛైర్మన్ నజమ్‌ సేథీ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను అంగీకరించేది లేదని చెప్పిన జకా అష్రాఫ్‌.. 24 గంటలు గడవకముందే తన మాట మార్చేశాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్ణయం మేరకు ముందుకు వెళ్తానని తాజాగా ప్రకటించాడు. ఆసియా కప్‌ మ్యాచ్‌ల నిర్వహణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. దీంతో ఆసియా కప్‌ నిర్వహణపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది.

‘హైబ్రిడ్ మోడల్‌ను నేను వ్యతిరేకించా. దేనివల్ల పాకిస్తాన్ క్రికెట్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని నేను భావిస్తున్నా. అందుకే హైబ్రిడ్ మోడల్‌ నాకిష్టం లేదు. అతిథ్య దేశంగా టోర్నీ నిర్వహణ ద్వారా పాకిస్థాన్‌కు ప్రయోజనాలు దక్కాలి. శ్రీలంకకు ఎక్కువ మ్యాచ్‌లను కేటాయించడం నాకు నచ్చలేదు. అయితే టోర్నీ నిర్వహణలో ఏసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఏసీసీ ప్రకారమే ముందుకు వెళ్తాం. ఏసీసీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. ఇప్పటినుంచి అయినా మేం మా దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం ఉండేలా చూసుకుంటాం’ అని జకా అష్రాఫ్‌ చెప్పినట్టు ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.

మొన్నటివరకు పీసీబీ తాత్కాలిక ఛైర్మన్‌ పదవిలో ఉన్న నజమ్‌ సేథీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో కొత్త ఛైర్మన్‌గా జకా అష్రాఫ్‌ బాధ్యతలు అందుకోనున్నాడు. ఇక ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ 2023 జరగనుంది. ఆసియా దేశాలు ఏ టోర్నీలో పాల్గొననున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ ఆసియా కప్ 2023లో తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్, నేపాల్ గ్రూప్-1లో.. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక గ్రూప్-2లో ఆడనున్నాయి.

Also Read: BCCI Cheif Selector: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఆహ్వానాలు.. కావాల్సిన అర్హతలు ఇవే! రేసులో డాషింగ్ ఓపెనర్

Also Read: Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. సూపర్ లుకింగ్, బెస్ట్ ఫీచర్స్!