Ramiz Raja: భారత ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు.. బిలీయనీర్ ఆటగాళ్ల కంటే మా ఆటగాళ్లే నయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramiz Raja: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన అనూహ్యంగా సెమీస్ బెర్త్ కైవసం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్‌కు చేరింది. అయితే మరో సెమీస్‌లో భారత్ ఓడిపోయి ఇంటిముఖం పట్టడంపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నాడు. టీమిండియా, బీసీసీఐని అవహేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్‌పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ల ఆటగాళ్లు ఉన్న టీమ్ ఇంటికెళ్లిందని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. గత నెలలోనే ముగ్గురు ఆటగాళ్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచారని, ఇది చాలు తామేంటో చెప్పడానికి అంటూ రమీజ్ రాజా గొప్పలు చెప్పుకున్నాడు. ఐపీఎల్‌తో ప్రపంచ మేటి ఆటగాళ్లు సిద్ధమవుతున్నారని గొప్పలు చెప్పుకునే బీసీసీఐ ఇప్పుడేం సమాధానం చెబుతుందని పరోక్షంగా ప్రశ్నించాడు.
Read Also: Team India: అక్కడ టాప్‌గా నిలిస్తే.. కప్పు మాత్రం రాదు.. ఇది పక్కా..!!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పుంజుకున్న తీరు అద్భుతమని రమీజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్ సూపర్-12లో తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా, జింబాబ్వే చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై గెలిచి అనూహ్యంగా సెమీస్ బెర్త్ సాధించింది. అయితే భారత్ మాత్రం సూపర్-12 దశలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. కానీ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా టెస్ట్ సిరీస్ జరగనుందంటూ వస్తున్న వార్తలపై కూడా రమీజ్ రాజా స్పందించాడు. ఈ సిరీస్‌పై తనకు ఎలాంటి అవగాహన లేదని చెప్పాడు. భారత్-పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!