Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins Praises on Cheteshwar Pujara: ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ తాను ఎదుర్కొన్న భారత బ్యాటర్లలో అత్యంత కఠినమైన ప్రత్యర్థి ఎవరో చెప్పాడు. టీమిండియా మాజీ టెస్టు బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా వెరీ టఫ్ అని పేర్కొన్నాడు. పుజారా క్రీజులో పాతుకుపోయి బౌలర్లను తీవ్రంగా విసిగించేవాడని చెప్పాడు. తాజాగా పలు దేశాల నుంచి తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థులను ఎంపిక చేయాలని కమిన్స్‌ను అడిగారు. భారత్ నుంచి ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు ఏమాత్రం సందేహించకుండా పుజారా పేరును చెప్పాడు.
చతేశ్వర్ పుజారాను ఔట్ చేయడం అంత సులభం కాదని, అతడు క్రీజులో ఎంతసేపైనా ఉండేందుకు సిద్ధంగా ఉంటాడని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ‘భారత్ నుంచి టఫ్ బ్యాటర్ అంటే పుజారానే ఎంచుకుంటా. అతడిని ఔట్ చేయడం చాలా చాలా కష్టం. పుజారా క్రీజులో ఉంటే ఏదో మూలాన బాధగా ఉంటుంది. అతడు కావాలనుకుంటే 100 డాట్ బాల్స్‌ను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వడు’ అని కమిన్స్ చెప్పాడు. కమిన్స్ తన కెరీర్లో ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో ఎక్కువగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లనే ఎంపిక చేశాడు.
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
- Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
పాకిస్థాన్ నుంచి మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను ప్యాట్ కమిన్స్ ఎంచుకున్నాడు. అజ్మల్ బౌలింగ్‌ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. ‘పాకిస్థాన్ నుంచి సయీద్ అజ్మల్. అతను ఒక ప్రత్యేకమైన బౌలర్. ఒకసారి ఓవర్ చివరి బంతికి నేను క్రీజులోకి వచ్చాను. అజ్మల్ బంతి వేశాడు. నేను ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే క్లీన్ బౌల్డ్ అయ్యాను. అలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. అజ్మల్ టఫ్ బౌలర్’ అని కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి అలిస్టర్ కుక్, దక్షిణాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెకల్లమ్, శ్రీలంక నుంచి తిలకరత్నే దిల్షాన్, వెస్టిండీస్ నుంచి క్రిస్ గేల్‌ను కమిన్స్ తన జాబితాలో చేర్చాడు.
చతేశ్వర్ పుజారా గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా 7,195 పరుగులు చేశాడు. 43.60 సగటుతో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు సాధించాడు. అలాగే భారత్ తరఫున ఐదు వన్డేలు ఆడి 51 పరుగులు చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత కమిన్స్ దక్షిణాఫ్రికాలో వన్డే జట్టుతో కలవనున్నాడు. అక్టోబర్ 9 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!