Questions Raised By Pakisthan AARMY Training: 2024 టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పసికూన అమెరికా ఏకంగ వరల్డ్ క్రికెట్ లో టాప్ టీం అయిన పాకిస్థాన్‌పై చరిత్రాక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఇక లక్ష్యఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఆరోన్ జోన్స్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ (14; 14 బంతుల్లో) రాణించారు.. దీనితో సూపర్ ఓవర్ ఆడలిసి వచ్చింది. మొదట సూపర్ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ఇందులో 7 రన్స్ ఎక్స్ ట్రాలే. 19 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ 13/1 రన్స్‌కు పరిమితమైంది. ఇంకేముంది అమెరికా చేతిలో ఓటమిపాలయింది. దీనితో నెటిజన్స్ ఆర్మీ ట్రైనింగ్ ఏమైంది అని మండిపడుతున్నారు.
Also Read; PAK vs USA: అరగంట చాలు మాకు.. అన్నంత పని చేసిన అమెరికా కెప్టెన్!
గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు ఫిట్‌నెస్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ పాక్ జట్టు ఘోరంగా విఫలమైంది. తరువాత స్వదేశంలో న్యూజలాండ్ టీమ్ తో జరిగిన టీ20లో ఓటమిపలు కావడంతో పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2024 సీజన్ ముగిసిన వెంటనే జాతీయ జట్టులోని సభ్యులతో పాటు ఇతర క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్ మొదలెట్టింది. పాకిస్థాన్ సైన్యంతో కఠిన శిక్షణ ఇచ్చింది. ఈ 20 వరల్డ్‌కప్‌కు జట్టు సభ్యులు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగేలా కాకుల్ ఆర్మీ క్యాంపులో కఠిన శిక్షణ అమలు చేసారు. అయిన కుడా అమెరికా చేతిలో ఓడిపోవడంతో ఘోర విమర్శలను ఎదుర్కొటుంది