NTV Telugu Site icon

Indian Flag In Pak: దెబ్బకి దిగొచ్చిన పాక్.. ఆ స్టేడియంలో భారత జాతీయ పతాకం

Flag

Flag

Indian Flag In Pak: ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్థాన్ ఆథిత్యం వహిస్తుంది. ఈ మెగా టోర్నీ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ ఈవెంట్ కు ముందు ఇటీవల కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్‌ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.

Read Also: Alia Bhatt : క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్న ఆలియా భట్

అయితే, ఇటీవల కరాచీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ పతాకలను ప్రదర్శించగా.. అందులో భారత జెండా లేదు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పాక్‌ తీరుపై పలువురు మండిపడ్డారు. దీనిపై పీసీబీ రియాక్ట్ అయింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడటానికి పాక్‌కు భారత్‌ రావట్లేదు. కరాచీ, రావల్పిండి, లాహోర్‌ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతున్న టీమ్స్ జెండాలను మాత్రమే ఎగుర వేశామని తేల్చి చెప్పింది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌ జెండాను కూడా పాక్ ప్రదర్శించలేదని పేర్కొనింది. దీనిపై పీసీబీ అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదని బోర్డు వర్గాలు తెలిపాయి.

Read Also: YS Jagan: గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్.. ర్యాలీగా మిర్చి యార్డ్‌ వద్దకు..!

కానీ, దీనిపై తీవ్ర విమర్శలు క్రమంగా పెరుగుతుండటంతో ఈ వివాదానికి పీసీబీ ముగింపు పలికింది. తాజాగా కరాచీ స్టేడియానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది. అందులో భారత జాతీయ పతాకం కనిపిస్తోంది.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలు దర్శనం ఇస్తున్నాయి. దీంతో ఈ వివాదానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది.