INS vs PAK T20 World Cup: ‘‘టీమిండియా ఇష్టం’’.. హ్యాండ్ షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్..

  • ‘‘హ్యాండ్ షేక్’’ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్పందన..
  • క్రీడాస్పూర్తితో ఆడాలని సూచన, వారి ఇష్టం అంటూ కామెంట్స్..
Ind Vs Pak

Ind Vs Pak

INS vs PAK T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఐసీసీ టోర్నీలో అన్ని మ్యాచులు ఒకెత్తయితే, దాయాదుల సమరం మరో ఎత్తు. ఈ రెండు దేశాల పోటీ కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తుంటారు. అయితే, గత ఆసియా కప్ టోర్నమెంట్‌లో ‘‘ హ్యాండ్ షేక్’’ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత జరిగిన ఈ టోర్నీలో భారత్ ప్లేయర్లు, పాకిస్తాన్ ప్లేయర్లతో ‘‘కరచాలనం’’ చేయడానికి ఇష్టపడలేదు.

Read Also: Bangladesh: భారత సరిహద్దుల్లో “జమాత్” విజయం.. చికెన్స్ నెక్, ఈశాన్యానికి ప్రమాదం..

ఇదిలా ఉంటే, దీనిపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రాబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో క్రీడాస్పూర్తితో ఆడాలని అఘా అన్నారు. నిర్ణయం భారత్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ‘‘క్రికెట్ స్ఫూర్తితో ఆడాలి. నా వ్యక్తిగత అభిప్రాయం పట్టింపు లేదు, కానీ క్రికెట్‌ను ఎప్పుడూ ఆడిన విధంగానే ఆడాలి. ఏమి చేయాలో వారి ఇష్టం’’ అని అన్నారు.