T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అన్ని రంగాలలో భారత్ వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు, రనౌట్లు మిస్ చేయడంతో విజయం చేజారింది. అయితే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ పిచ్‌పై తొలుత కావాలనే బ్యాటింగ్ తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత టాప్-5 బ్యాటర్లు దారుణంగా విఫలమవ్వడం.. చేతిలోకి వచ్చిన సునాయస క్యాచ్‌లను విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ క్రికెటర్ నేలపాలు చేయడం, రోహిత్ వంటి ఆటగాడు ఈజీ రనౌట్లను చేయలేకపోవడం ఫిక్సింగ్‌కు సాక్ష్యాలని పేర్కొంటున్నారు.
Read Also: Bhagat Singh Drama: బాలుడి ప్రాణం తీసిన భగత్‌సింగ్ నాటకం.. ప్రాక్టీస్ చేస్తూ మృతి
ముఖ్యంగా భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని పాకిస్థాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే టీమిండియా పక్కా వ్యూహంతోనే దక్షిణాఫ్రికా ఓడిపోయిందని పాకిస్థాన్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌ను చాలా ఆసక్తిగా గమనించిన పాక్ అభిమానులు భారత్ ఓటమిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రయాణాన్ని అడ్డుకోవాలనే కుట్రతోనే భారత్ ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకుందని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదని తెలిసి కూడా తొలుత బ్యాటింగ్ తీసుకుని నిర్లక్ష్యపు షాట్లతో ఆ జట్టు ఆటగాళ్లు వికెట్లు పారేసుకున్నారని పాకిస్థాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
One thing I must say they fix but not for money!
IND vs SA#INDvsSA pic.twitter.com/6DjQOU9fy3— Kashaf Husnayn (@_Ghadeeri_) October 30, 2022
