T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అన్ని రంగాలలో భారత్ వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు, రనౌట్లు మిస్ చేయడంతో విజయం చేజారింది. అయితే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ పిచ్‌పై తొలుత కావాలనే బ్యాటింగ్ తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత…