2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ నుంచి తరలించే అవకాశం ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను నిర్ణయించేందుకు వర్చువల్ సమావేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఏర్పాటుకు ఒక రోజు ముందు ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తే.. భద్రతాపరమైన సమస్యలు వస్తాయని పలు దేశాల బోర్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈవెంట్‌ను పాకిస్తాన్ నుంచి తరలించే ఛాన్స్ ఉంది. ఇక, PCB దీనిని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అంగీకరించే అవకాశం కూడా ఉంది.
Read Also: AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన!
అయితే, పాకిస్తాన్ రాజధాని ప్రాంతంలో సామాజిక-రాజకీయ అశాంతి కారణంగా పాకిస్తాన్ A జట్టుతో శ్రీలంక A జట్టు మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌ను విజయవంతంగా నిర్వహించాలనే పాకిస్తాన్ కు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. 1996 తర్వాత తమ మొదటి ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వాలని పాకిస్తాన్ భావిస్తోండగా.. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరంగా చెప్పుకోవాలి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. దీంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కనిపిస్తే కాల్చి వేయండని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Sangareddy: అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..
ఇక, ఛాంపియన్ ట్రోఫీని ఆడేందుకు సరిహద్దు దాటి వెళ్లేందుకు భారతదేశం నిరాకరించింది. అంతలోనే, పాకిస్థాన్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో.. దేశంలో మెగా ఈవెంట్‌ను నిర్వహించడం మరింత అసాధ్యమైంది. ఇక, పాక్ నుంచి టోర్నీ నిర్వహణ హక్కులను ఐసీసీ లాక్కునే అవకాశం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. అయితే, 2013లో శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టుపై దాడి జరిగిన తర్వాత అంతర్జాతీయ జట్లు ఒక దశాబ్దానికి పైగా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు నిరాకరించాయి. ఇటీవలే ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక తమ జట్లను పాక్ పర్యటనలకు పంపించాయి. కానీ, శ్రీలంక A టూర్ రద్దు చేయడం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌కు వెళ్లకుండా పలు దేశాల క్రికెట్ టీమ్స్ జాగ్రత్తపడుతున్నాయి.