Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ జరుగుతుండగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాగా, రియాక్టర్ పేలుడుతో పారిశ్రామిక వాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read also: Astrology: నవంబర్ 28, గురువారం దినఫలాలు
హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ మొఘల్ కా నాల వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. కార్వాన్ రోడ్డు లోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో మంటలు అంటుకున్నాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికీలకాలు ఎగసి పడ్డాయి. మంటలకు తోడు దట్టంగా నల్లటి పొగ వ్యాపించింది. ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం కావడంతో శనలమీద మంటలు అంటుకున్నాయి. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను ఆర్పారు. ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఎవరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. షాక్ షర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గుడిమల్కాపూర్ నాల వద్ద అగ్నిప్రమాదం జరగడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు రోడ్డు పై నిలచాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే యూటర్న్..? టైం కోసం ఎదురుచూస్తున్నారా..?