NTV Telugu Site icon

Oval Stadium: క్రికెట్ మైదానాన్ని కప్పేసిన మంచు.. హిమాలయాలను తలపిస్తున్న స్టేడియం

Oval Stadium

Oval Stadium

Oval Stadium: ప్రస్తుతం శీతాకాలం సీజన్ నడుస్తోంది. భారత్‌లోనే కాదు ఇంగ్లండ్‌లోనూ ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. క్రిస్మస్‌కు ముందే లండన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అటు యూకేలోని చాలా ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు మైనస్ 10-12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత ఓవల్ మైదానాన్ని రెండు అడుగుల మేర మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఓవల్ మైదానం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి నెటిజన్‌లను ఆకట్టుకుంటున్నాయి. ఓవల్ మైదానం హిమాలయాలను తలపిస్తుందని, అసలు ఇది క్రికెట్ గ్రౌండ్ అని ఎవ్వరూ అనరని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓవల్ మైదానంలో క్రికెట్‌కు బదులు ఐస్ హాకీ ఆడుకోవచ్చని పలువురు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Read Also: ఈ అలవాట్లు ఉంటే బెడ్‌రూంలో వీక్ అయిపోతారు.. జాగ్రత్త..!!

కాగా 1845లో ఓవల్ మైదానాన్ని నిర్మించారు. ఈ స్టేడియంలో 23,500 మంది మ్యాచ్‌ను వీక్షించవచ్చు. 1880లో ఇక్కడ తొలి టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన రెండో మైదానంగా ఓవల్ గుర్తింపు పొందింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య ఇంగ్లండ్ ఓవల్ మైదానం వేదికగా ఓ టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ జరగనున్నాయి. అంతేకాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఓవల్‌ మైదానంలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌ను ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

Show comments