Site icon NTV Telugu

IND-W vs ENG-W: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?

Indq

Indq

IND-W vs ENG-W: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా రెడీ అయింది. అయితే, మనం సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్‌ ఫలితం భారత్ కు కీలకం కానుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బౌలింగ్‌ చేయనుంది. ఇక, బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్‌కు లేదు, ఆమె స్థానంలో రేణుకా సింగ్‌ ఠాకూర్ తుది జట్టులో అవకాశం దక్కించుకుంది.

Read Also: Dude : 2 రోజుల్లో 45 కోట్లు+కొట్టేశారు డ్యూడ్

ఇక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల చేతుల్లో గత రెండు మ్యాచ్ ల్లో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో పోరు అంత తేలిక కాదు అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. బలంగా ఉన్న ఆ జట్టు టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఓటమిని చూడలేదు. ఇంగ్లాండ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కాగా, సెమీ ఫైనల్‌ రేసులో ముందున్న ఇంగ్లాండ్‌పై గెలవాలంటే భారత్‌ గట్టిగా పుంజుకోవాలి.

తుది జట్లు
భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్‌ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్‌

ఇంగ్లాండ్‌: అమీ జోన్స్‌, టామీ బీమౌంట్, హీదర్ నైట్, నాట్ స్కివర్ (కెప్టెన్), సోఫియా డంక్లే, కాప్సీ, లాంబ్, డీన్, సోఫీ, స్మిత్, బెల్

Exit mobile version