T20 World Cup 2022: స్టేడియం సామర్థ్యానికి మంచి అమ్ముడైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2022: ఈనెల 16 నుంచి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అసలు టోర్నీ మాత్రం ఈనెల 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఆరంభం అవుతుంది. ఈనెల 23న టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఆరోజు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానుల ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీకే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆసియా కప్ తర్వాత దాయాది దేశాలు మరోసారి ప్రపంచకప్‌లోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెలోబోర్న్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లు విక్రయానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే అన్ని అమ్ముడుపోయినట్లు ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు.
Read Also: Ravi Shastri: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. గంగూలీకి పరోక్షంగా రవిశాస్త్రి చురకలు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
- World Cup 2027: వరల్డ్ కప్‌లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
- Maharashtra: టీమ్‌లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 90వేల మంది కూర్చునేలా సీట్ల కెపాసిటీ ఉందని.. ఈ మొత్తం టిక్కెట్లను విక్రయానికి ఉంచగా అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. మరిన్ని టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయాన్ని పసిగట్టి స్టేడియంలో నిలుచుని మ్యాచ్‌ని తిలకించే విధంగా కొన్ని అదనపు టికెట్లను విడుదల చేయగా ఈ టికెట్లు కూడా కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్లు వివరించారు. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల కౌంటర్లలో సోల్డ్ అవుట్ బోర్డులు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఇప్పటివరకు 6 లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. అటు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న గ్రూప్ స్టేజీలో శ్రీలంక, నమీబియా, యూఏఈ, వెస్టిండీస్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్ తలపడనున్నాయి.
తాజావార్తలు
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
-
August 2026 Horoscope: ఆగస్టులో ఈ 4 రాశులకు ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం.. ఆకస్మిక ధనలాభాలు?
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!