నాటింగ్ హామ్ టెస్ట్ : విజయం అంచున టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాటింగ్హమ్ టెస్ట్.. చివరి రోజు కీలకంగా మారింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. గెలవాంటే ఇంకా 157 పరుగులు చేయాలి..! అటు ఇంగ్లండ్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి..! దీంతో గెలుపు కోసం రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
అంతకుముందు ఇంగ్లండ్ టీమ్ 303 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జో రూట్ సెంచరీ చేశాడు. 109 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్ట్ కెరీర్లో రూట్‌కి ఇది 21వ సెంచరీ. రూట్‌కి మిగిలిన బ్యాట్స్‌మెన్ సహకరించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైన చేయగలిగింది. రూట్‌తో పాటు కర్రన్ 32 పరుగులు, బెయిర్‌స్టో 30 పరుగులు చేశారు. ఇక టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బూమ్రాకు ఐదు వికెట్లు తీశాడు. సిరాజ్, శార్దూల్‌లకు చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఈ టెస్ట్.. రెండు, మూడు రోజులలో వర్షం కారణంగా అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. నాలుగో రోజు మాత్రం వరణుడు తెరిపినిచ్చాడు. చివరిరోజైన ఈరోజు.. వర్షం పడకుంటే మ్యాచ్ ఫలితం తేలుతుంది. లేక వర్షార్పణం అయితే మాత్రం డ్రా గా ముగిసే అవకాశం ఉంది. చేతిలో వికెట్లు ఉన్నందున భారత్‌కే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే చివరిరోజు పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లీష్ బౌలర్లను తక్కువగా అంచనావేయడానికి లేదు. అండర్సన్ తాజాగా కుంబ్లే రికార్డ్‌ను అధిగమించి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఒక రోజు ఉండటం .. చేయాల్సిన స్కోర్ పెద్దగా లేకపోవడంతో ఇప్పటివరకు ఆధిపత్యం చెలాయించిన భారత్.. చివరి రోజు సత్తా చూపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
- Tags
- england
- india
- Nottingham Test
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!