World Championships : అదరగొట్టిన అమ్మాయిలు.. ఫైనల్ కు నిఖత్, నీతూ, లవ్లీనా, స్వీటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2023లో భారత్ కు మరో రెండు సిల్వర్ మెడల్స్ ఖాయమయ్యాయి. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంప్ గా బరిలోకి దిగిన భారత స్టార్ బాక్సర్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొడుతోంది. రింగ్ లో తన పవర్ ఫుల్ పంచ్ లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడుతున్న నిఖత్ జరీన్.. ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. అయితే మార్చ్ 23 తేదీన జరిగిన సెమీ ఫైనల్ లో కూడా తన పవర్ పంచ్ ను చూపించింది.
Also Read : Marriage Fraud: కోరుకున్న పెళ్లాం దొరికింది అనుకున్నాడు.. పెళ్లాయ్యాక కానీ అర్థం కాలేదు..
Also Read
- Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
- Ajinkya Rahane: "మా విజయ రహస్యం ఇదే".. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
- Hardik Pandya: "సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం".. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
బలమైన ప్రత్యర్థిని తన పంచ్ లతో నిఖత్ జరీన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. కొలంబియన్ బాక్సర్ ఇంగ్రిట్ లొరెనా వాలెన్సియా విక్టోరియాపై 5-0 తేడాతో వన్ వార్ తో విజయం సాధించింది. తద్వారా ఫైనల్ కు అర్హత సాధించింది. ఇక ఈ ఫైనల్ లో విజయం సాధిస్తే స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. అలానే 48 కేజీల విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీ ఫైనల్ లో కఖికిస్థాన్ కు చెందిన అలుయా బాల్కిబెకోవాపై 5-2 తేడాతో గెలుపొందింది.
Also Read : UK Parliament: “ఖలిస్తానీ పోకిరీల”పై చర్యలు తీసుకోవాలి.. యూకే పార్లమెంట్ లో ఎంపీల డిమాండ్..
ఇది తన ఉత్తమ బౌట్.. టెక్నిక్ పరంగా మెరుగ్గా ఉన్న బాక్సర్లను ఉదుర్కొన్నప్పుడు తాను అత్యత్తమంగా ఆడతాననిపిస్తుంది. వాలెన్సియాతో గతంలోనూ తలపడ్డా.. ఆమె అనుభవమున్న బాక్సర్.. ఆమెతో పోరు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సాగిందని నిఖత్ జరీన్ అన్నారు. అంతకుముందు బుధవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్ పోటీల్లో టోర్నీ ఫేవరెట్ అయిన నిఖత్ 5-2తేడాతో థాయ్ లాండ్ కు చెందిన రెండుసార్లె వరల్డ్ ఛాంపియన్స్ షిప్, కాంస్య పతక విజేత చుతామత్ రక్సాత్ ను మట్టి కురిపించింది. ఈ పోరులోని తొలి రెండు రౌండ్లలో జాగ్రత్తగా ఎటాకింగ్ చేసి పవర్ ఫుల్ పంచ్ లు విసిరిన నిఖత్.. మూడో రౌండ్ లో మాత్రం కాస్త జోరు తగ్గింది.
Also Read : Satyam Shivam Sundaram: జీనత్ అందాలపర్వం – ‘సత్యం శివం సుందరం’!
అయితే ఈ ఛాంపియన్ సిప్స్ నీతూ గాంగాస్(48కేజీ), లవ్లీనా(75కేజీ ), స్వీటీ బూర(81కేజీ) కూడా ఫైనల్స్ లో అడుగుపెట్టారు. గతేడాది క్వార్టర్స్ లో తనను ఓడించిన అలువా బల్కిబెకోవా( కజకిస్థాన్)పై నీతు ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్ లో ఆమె 5-2తేడాతో నిరుడు రజత విజేత బల్కిబెకోవాను ఓడించింది. తొలి రౌండ్ లో 2-3తో వెనకబడ్డప్పటికీ నీతు అద్బుతంగా పుంజుకుంది. తనను ప్రత్యర్థి తరచుగా నెడుతూ, కిందపడేసినా.. తిరిగి లేచిన ఆమె పంచ్ లతో విరుచుకుపడింది. ఉత్కంఠగా సాగిన చివరి రౌండ్ లోనూ నీతు అదే వేగాన్ని ప్రదర్శించింది. పోరు హోరాహోరీగా ముగియడంతో చివరికి సమీక్షలో నీతును విజేతగా ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో రెండు కాంస్యాలు నెగ్గిన లవ్లీనా.. తొలిసారి ఈ టోర్నీ తుదిపోరు చేరింది. సెమీస్ లో ఆమె 4-1తో లి కియాన్(చైనా)ను ఓడించింది. స్వీటీ 4-3తేడాతో ఎమ్మా గ్రీన్ ట్రీ ( ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచింది.
తాజావార్తలు
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!