భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 217 పరుగులకే కుప్పకూలాగా ఇప్పుడు కివీస్ 249 పరుగుల వద్ద ఆల్ ఔట్ ఔట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో షమీ 4 వికెట్లతో రాణించగా ఇషాంత్ శర్మ 3, అశ్విన్ 2, జడేజా ఒక్క వికెట్ తీశారు. ప్రస్తుతం విలియమ్సన్ సేన 32 పరుగుల ఆధిక్యంతో ఉంది. అయితే ఈ మ్యాచ్ కు ఇదే చివరి రోజు కాగా రేపు రిజర్వర్డ్ డే ఉంది. మ్యాచ్ రిజల్ట్ రాకపోతే రెండు జట్లను విజేతలుగా ప్రకటించనుంది ఐసీసీ. చూడాలి మరి ఈలోగా మ్యాచ్ ఫలితం వస్తుందా… లేదా అనేది.