Netigens Trolling KL Rahul For Poor Show Against England: కీలక మ్యాచ్‌లు వచ్చాయంటే చాలు.. పెవిలియన్‌కి ఎప్పుడెప్పుడు పరుగులు పెడదామా? అని కేఎల్ రాహుల్ ఎదురుచూస్తుంటాడు. కనురెప్ప మూయడం కన్నా వేగంగా తన వికెట్ సమర్పించుకొని.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి, సేద తీరుతాడు. ఈసారి బాగా ఆడుతాడని అనుకున్న ప్రతీసారి.. కేఎల్ రాహుల్ నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లోనూ అదే బాపతు. మొదట్లో తొలి బంతికే అతడు ఫోర్ కొట్టడంతో.. క్రీడాభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఈసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. తనపై ఉన్న చెత్త ముద్రను కేఎల్ రాహుల్ చెరిపేసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. రెండో ఓవర్‌లోనే ఆ అంచనాలన్నీ బొక్కబోర్లా పడ్డాయి. క్రిస్ వోక్స్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి.. రాహుల్ ఒక పేలవమైన షాట్ ప్రయత్నించి, వికెట్ సమర్పించుకున్నాడు.
అంతే.. అతనలా ఔట్ అవ్వడమే ఆలస్యం, టీమిండియా ఫ్యాన్స్ కేఎల్ రాహుల్‌పై ధ్వజమెత్తారు. అతడ్ని దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. అసలు ఈ టోర్నీ మొత్తంలోనే కేఎల్ రాహుల్ పెద్దగా సత్తా చాటింది లేదు. చేసిన రెండు అర్థశతకాలు కూడా బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లపైనే తప్ప.. పెద్ద జట్లతో ఆడిన మ్యాచెస్‌లో చేతులెత్తేశాడు. ఇప్పుడు ఈ కీలకమైన సెమీ ఫైనల్‌లోనూ 5 పరుగులకే ఔట్ అవ్వడంతో.. ఫ్యాన్స్ కోపాద్రిక్తులై, అతడ్ని ఏకిపారేస్తున్నారు. వెంటనే అతడ్ని టీమిండియా స్వ్కాడ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ అభిమానులుగా మేము రాహుల్ వల్ల చాలా బాధపడ్డామని, ఇంకెన్నాళ్లిలా బాధని అనుభవించాలని, వీలైనంత త్వరగా రాహుల్‌ని జట్టు నుంచి తొలగించాలని కోరుతున్నారు. అలాగే.. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ కంటే, బాటిల్ చేసేందుకు వినియోగించే ఓపెనరే ఎంతో నయమని సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కోసం ఆడటం తప్ప, టీమిండియాకు ఆడేంత సామర్థ్యం అతనికి లేదంటూ తిట్టిపారేస్తున్నారు.
ఒక అభిమాని అయితే ట్విటర్‌లో కేఎల్ రాహుల్‌ని ట్యాగ్ చేసి.. పోకిరి సినిమాలో ఆలీని బ్రహ్మానందం కొట్టే వీడియోని షేర్ చేస్తూ.. ‘ఇంకోసారి టీమ్‌లో కనిపిస్తే, కోసి కారం పెడతా’నంటూ వార్నింగ్ ఇచ్చేశాడు. మరో నెటిజన్ అయితే.. టీమిండియా కోసం కాకపోయినా, కనీసం నీ ప్రియురాలు అతియా శెట్టి కోసమైనా మంచి ఇన్నింగ్స్ ఆడు అంటూ కేఎల్ రాహుల్‌పై కౌంటర్ వేశాడు. టీమిండియాకు కేఎల్ రాహుల్‌కి మించిన మరో డిజప్పాయింట్‌మెంట్ మరేదీ లేదని, అతని స్థానంలో మరొకరిని అవకాశం ఇస్తే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా.. 2019లో న్యూజిలాండ్‌పై జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో కూడా కేవలం 1 పరుగు మాత్రమే చేసి, వికెట్ సమర్పించుకొన్నాడు.
https://twitter.com/Meeenakshiiii/status/1590619131380129792?s=20&t=3aRZktEa1HZLRzz4PryWIQ
https://twitter.com/iblvzz/status/1590619112619003904?s=20&t=KkOmcnfRPisvjq4Hu9kq9Q
https://twitter.com/Cricupdatesfast/status/1590617696114462723?s=20&t=3nVwZFU-Iuxba1IlU4GhOw
Still A Better Opener Than KL Rahul! 🥲 pic.twitter.com/5aoCT0IDi1
— Utkarsh Pandey 🍁 (@Pseudo_Nomad) November 10, 2022