BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ క్రికెట్ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. జూనియర్ క్రికెట్ కమిటీలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాల భర్తీకి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కమిటీ అండర్-22 స్థాయి వరకు భారత జట్ల ఎంపికతో పాటు యువ ప్రతిభను గుర్తించడం, కెప్టెన్లను ఎంపిక చేయడం, కోచింగ్ మరియు సహాయక సిబ్బంది నియామకం వంటి కీలక బాధ్యతలను నిర్వహించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 2026 సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం బీసీసీఐ వాటిని పరిశీలించి అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి, చివరగా ఐదుగురు సభ్యులను కమిటీలో నియమించనుంది.
మాజీ క్రికెటర్లకు అవకాశం
జూనియర్ క్రికెట్ కమిటీలో సభ్యుడిగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బీసీసీఐ కొన్ని కీలక అర్హతలను నిర్దేశించింది. అభ్యర్థులు మాజీ క్రికెటర్లు ఉండటంతో పాటు కనీసం 25 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలాగే క్రికెట్ నుంచి రిటైర్ అయి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇప్పటికే క్రికెట్ కమిటీలో మొత్తం ఐదేళ్ల పాటు పనిచేసిన వ్యక్తులు ఈ పదవులకు అర్హులు కారు.
Also Read
- Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
యువ ప్రతిభను గుర్తించడమే ప్రధాన లక్ష్యం
కొత్తగా ఏర్పడనున్న కమిటీ ప్రధానంగా అండర్-22 వరకు వివిధ వయసుల విభాగాల్లో భారత జట్ల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ పోటీల్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలను పరిశీలించి ప్రతిభావంతులను గుర్తించడం కమిటీ సభ్యుల ప్రధాన బాధ్యతల్లో ఒకటి. అలాగే కోచింగ్ క్యాంపులు, దేశీయ టోర్నమెంట్లు, విదేశీ పర్యటనలకు జట్ల ఎంపికలోనూ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు ఉపయోగపడేలా బలమైన రిజర్వ్ బెంచ్‌ను సిద్ధం చేయడం కూడా దీని లక్ష్యంగా ఉంటుంది.
కెప్టెన్లు, కోచ్‌ల ఎంపికలో కీలక పాత్ర
వివిధ ఫార్మాట్లలోని జూనియర్ భారత జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే బాధ్యత కూడా ఈ కమిటీకి ఉంటుంది. అంతేకాకుండా జట్లకు కోచ్‌లు, సహాయక సిబ్బంది ఎంపికలోనూ సభ్యులు భాగస్వాములు కానున్నారు. ఫిజియోథెరపిస్టులు, ట్రైనర్లు, థెరపిస్టులు, విశ్లేషకులు, వైద్య సిబ్బంది వంటి సహాయక విభాగాల అభ్యర్థులను పరిశీలించి నియామక ప్రక్రియలో కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల అభివృద్ధిని పర్యవేక్షిస్తూ కాలానుగుణంగా మూల్యాంకన నివేదికలను కూడా సిద్ధం చేయనుంది.
యువ ఆటగాళ్లకు అవగాహన కల్పించడంపైనా దృష్టి
యువ క్రికెటర్లను మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం చేయడంపైనా కొత్త కమిటీ దృష్టి పెట్టనుంది. సీనియర్, మాజీ క్రికెటర్లతో చర్చల ద్వారా డ్రగ్స్, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అంశాల వల్ల కలిగే ప్రమాదాలపై జూనియర్ ఆటగాళ్లకు అవగాహన కల్పించనుంది. చిన్న వయస్సు నుంచే యువ క్రికెటర్లలో క్రమశిక్షణ, క్రీడా నైతిక విలువలను పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది.
కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం BCCI అన్వేషణ
ఇదిలా ఉండగా, రాబోయే దేశీయ సీజన్ కోసం బీసీసీఐ కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఐడీఎఫ్‌సీతో ఉన్న ఒప్పందం ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో కొత్త స్పాన్సర్ కోసం బోర్డు అన్వేషణ కొనసాగిస్తోంది. అయితే బీసీసీఐ అంచనాలకు అనుగుణంగా తగిన ప్రతిపాదన ఇంకా అందకపోవడంతో కొత్త టైటిల్ స్పాన్సర్‌పై తుది నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
2027 Kawasaki Z900: Kawasaki Z900 బైక్ భారత్ లో లాంచ్.. 5-ఇంచ్ TFT డిస్ప్లే, 948cc ఇంజిన్, ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?