Munaf Patel: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దీంతో గంభీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 12 ఏళ్ల పాటు అజేయంగా నిలిచిన టీమిండియా.. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో సొంత మైదానాల్లో భారత్ ప్రదర్శన చెత్తగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితులు రావడానికి గంభీర్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని, అసలు కారణం బీసీసీఐ నిర్ణయాలేనని మాజీ భారత క్రికెటర్ మునాఫ్ పటేల్ స్పష్టం చేశారు.
Read Also: Stock Market: ఈరోజు ఆర్బీఐ పాలసీ వెల్లడి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
స్పిన్ ఆడలేకపోతున్న బ్యాటర్లు:
‘బ్రేకింగ్ స్పోర్ట్స్ విత్ వివేక్ సేథియా’ కార్యక్రమంలో మాట్లాడిన మునాఫ్ పటేల్.. టీమిండియా సొంత మైదానాల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేకపోవడమేనని అన్నారు. మన బ్యాటర్లకు కనీసం స్పిన్ బౌలింగ్ లో ఎలా ఆడాలో తెలియడం లేదు.. అందుకు కారణం డొమెస్టిక్ క్రికెట్‌లో తిరిగే పిచ్‌లు లేకపోవడమే అన్నారు. కనీసం 6 మిల్లీమీటర్ల గడ్డి తప్పనిసరి అని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.. అలా ఉంటే పిచ్ లో బంతి ఎలా తిరుగుతుంది? అని ప్రశ్నించారు.
గంభీర్‌ను తప్పుపట్టవద్దు:
గంభీర్‌ను టార్గెట్ చేయడాన్ని మునాఫ్ పటేల్ తీవ్రంగా తప్పుబట్టారు. అందరూ గౌతమ్ గంభీర్‌నే తప్పుపడుతున్నారు.. కానీ ఆయన మైదానంలోకి వెళ్లి బ్యాటింగ్ చేయడం లేదు.. బ్యాటింగ్ చేస్తున్న వాళ్లు సరిగ్గా ఆడలేకపోతున్నారని మండిపడ్డారు. గంభీర్‌పై నిందలు వేయడం అన్యాయం అన్నారు. గతంలో భారత్ హోం గ్రౌంగ్స్ లో ఆడే సమయంలో జట్టు బలాలకు అనుగుణంగా పిచ్‌లను తయారు చేసేవారని ఈ మాజీ క్రికెటర్ గుర్తు చేశారు. ముందు మన క్యూరేటర్లు మన బలాన్ని దృష్టిలో పెట్టుకుని పిచ్‌లు సిద్ధం చేసేవారు.. అందుకే సొంత మైదానాల్లో స్పిన్ కి అనుకూలించే పిచ్ లు ఉండేవి.. ఇప్పుడు బ్యాటర్లకు స్పిన్ ఎలా ఆడాలో కూడా తెలియడం లేదని విమర్శించారు.
Read Also: KA 2 : ‘క-2’లో కిరణ్ అబ్బవరం ఉండడా? హీరో మార్పుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
గంభీర్ మంచి కోచ్:
ఒక వ్యక్తినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గంభీర్ మంచి కోచ్.. ఆయన ఇప్పటికే ఒక ఐసీసీ టైటిల్ గెలిచారు అని మునాఫ్ పటేల్ తెలిపారు. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ను డ్రా చేయించారు అంటూ గంభీర్‌కు మద్దతు ప్రకటించారు. ఇక, భారత్ 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. అంతేకాదు, సొంత మైదానాల్లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి కారణంగా 2027 WTC ఫైనల్ అవకాశాలు కూడా ప్రమాదంలో పడ్డాయని క్రిడా విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, టీ20 ప్రపంచకప్ 2026 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీన అట్టహాసంగా స్టార్ట్ కానున్న ఈ మెగా టోర్నమెంట్, మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈసారి ప్రపంచకప్ టైటిల్ కోసం మొత్తం 20 జట్లు బరిలో ఉండగా, 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగు పెడుతున్న భారత్, మూడోసారి కప్ గెలిచి, టైటిల్‌ను నిలబెట్టుకున్న జట్టుగా రికార్డు సృష్టించాలని చూస్తుంది.
