PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్‌గా అరుదైన ఘనత!
- ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై పీవీ సింధు సత్తా
- జపాన్ ఓపెన్ 2026 విజేతగా సింధు
- తొలి భారత షట్లర్‌గా తెలుగు తేజం సింధు ఘనత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu Becomes First Indian to Win Japan Open 2026 Title: తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై తన సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య జపాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో పీవీ సింధు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడిన ఆమె.. చిరకాల ప్రత్యర్థి యమగుచికి పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. మొత్తం 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రతి గేమ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగినప్పటికీ.. కీలక సమయంలో సింధు తన అనుభవాన్ని ప్రదర్శించి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు కెరీర్లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ షట్లర్‌గా చరిత్రలో నిలిచింది.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
అంతేకాదు 2019లో ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత పీవీ సింధుకు ఇదే తొలి ప్రధాన అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. దీంతో దాదాపు ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న టైటిల్ నిరీక్షణకు ముగింపు పలికింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో 2024 డిసెంబర్లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకు ఇదే తొలి ట్రోఫీ. ఇటీవల ఫామ్‌పై వచ్చిన విమర్శలకు ఈ విజయంతో సింధు గట్టి సమాధానం చెప్పింది. జపాన్ ఓపెన్‌లో చారిత్రాత్మక విజయంతో సింధు మరోసారి భారత క్రీడాభిమానులను గర్వపడేలా చేసింది. ఆమె విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు