Mumbai Indians: ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Women Won Against Delhi Capital: మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో ముంబయి ఇండియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై హర్మన్ ప్రీతి కౌర్ సేన గెలుపొందాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై జయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీపై ముంబయి ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్థేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి ఛేధించింది. ముంబై ఓపెనర్లు యాస్తికా భాటియా ( 32 బంతుల్లో 41 రన్స్, 8 ఫోర్లు ), హీలీ మాత్యూస్ ( 31బంతుల్లో 32 రన్స్, 6 ఫోర్లు ) పరుగులతో రాణించారు. నాట్ సివర్ బ్రంట్ (23*), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్( 11* ) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లు అలిస్ క్యాప్సీ, తారా నోరిస్ చెరో వికెట్ తీసుకున్నారు.
Tamilnadu Crime: టీ పెట్టిన చిచ్చు.. వేడిగా లేదన్న పాపానికి, కోడలి కిరాతకం
Also Read
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
- Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
- Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. 18 ఓవర్లలో 105 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లానింగ్ (43; 41 బంతుల్లో 5 ఫోర్లు ) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాణించింది. జెమీమా రోడ్రిగ్స్ (25; 18 బంతుల్లో 3 ఫోర్లు ) పరుగులతో ఫర్వాలేదనిపించింది. షెపాలీ వర్మ (2), అలీస్ క్యాప్సీ (6), మరిజన్నే కాప్ (2), జొనాసెన్(2), తనియా భటియా(4), మిన్నుమని (0), రాధా యాదవ్(10), శిఖాపాండే(4), తారా నోరిస్(0) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. ముంబయి బౌలర్లు సైకా ఇషాక్ (3), వాంగ్(3), హీలీ మాత్యూస్ (3) వికెట్లు తీసి చెలరేగిపోయారు. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది. కాగా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఇది ఫస్ట్ ఓటమి.
Shocking news: గర్భం అనుకుని హాస్పిటల్కు వెళ్తే.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్
అమితే ఢిల్లీ క్యాపిటల్స్ 12 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 80 పరుగులతో కొంచెం మెరుగ్గ కనిపించింది. . మరో 25 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరి ఏడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక, 13వ ఓవర్ల ఇషాక్, రోడ్రిగ్స్, మెగ్ లానింగ్ లను పెవీలియన్ కు పంపించి ఢిల్లీని గట్టి దెబ్బకొట్టింది. ఆ తర్వాత ఓవర్ లో కూడా ఢిల్లీ టీమ్ రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గత మ్యాచ్ లో రాణించిన జొనాసెన్ తో పాటు మిన్నును మాత్యూస్ ఔట్ చేసింది. ఇక, 16.2,61.6 బంతుల్లో ఇస్సీ వాంగ్.. భాటియా, రాధాయాదవ్ లను ఔట్ చేసింది. తర్వాత ఓవర్లో నోరిస్ ను.. ఎల్బీడబ్యూ కావడంతో ఢిల్లీ ఆలౌటైంది.
Pralhad Joshi: కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగింది.. కేంద్రమంత్రి వింత ప్రకటన
కాగా, ముంబయి ఇండియన్స్ జట్టు వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఒక రెండు మ్యాచుల్లో గెలిచి మూడో మ్యాచ్ ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక రెండు మ్యాచులు ఆడి ఒక దాంట్లో గెలిచిన యూపీవారియర్స్.. మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచిన గుజరాత్ జెయింట్స్.. చెరో 2 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాలకు పరిమితమయ్యాయి. ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఖాతా తెరవకపోవడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!