MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ఎంఎస్ ధోనీ మధ్య అనుబంధం మరో కీలక మలుపు తిరగనుందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికి మెంటర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్న ధోనీ.. ఇప్పుడు సీఎస్కేలో యాజమాన్య వాటా కూడా పొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాంచైజీలో ధోనీకి 12 శాతం వాటా ఇచ్చేందుకు ఇరు పక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు ఓ క్రీడా ఛానెల్ తన కథనంలో వెల్లడించింది. అయితే ఈ వాటాల కొనుగోలుకు సంబంధించిన పూర్తి చెల్లింపును ధోనీ ఇంకా చేయలేదని పేర్కొంది. 12 శాతం వాటా వ్యవహారంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
క్రిక్‌బ్లాగర్ కథనం ప్రకారం.. సీఎస్కే యాజమాన్యం, ఎంఎస్ ధోనీ మధ్య వాటా విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. తొలుత ఫ్రాంచైజీలో 25 శాతం వాటా కావాలని ధోనీ కోరగా.. యాజమాన్యం మూడు శాతం వాటా మాత్రమే ఇస్తామని ప్రతిపాదించింది. ఆ తర్వాత ధోనీ 20 శాతం అడగ్గా.. సీఎస్కే నాలుగు శాతం వాటా ఇవ్వడానికి ముందుకొచ్చింది. తదుపరి చర్చల్లో ధోనీ 18 శాతం వాటా కోరగా.. ఫ్రాంచైజీ 5.5 శాతం వాటా ఇస్తామని ప్రతిపాదించింది. చివరకు ఇరు పక్షాలు మధ్యేమార్గంగా 12 శాతం వాటా విషయంలో అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించింది. అయితే ఈ వాటా ద్వారా ధోనీకి ఫ్రాంచైజీ నిర్ణయాల్లో గణనీయమైన అధికారాలు ఉండబోవని, వాటాల కొనుగోలుకు సంబంధించిన పూర్తి చెల్లింపు కూడా ఇంకా పూర్తికాలేదని నివేదిక పేర్కొంది.
Also Read
- IND vs NZ 1st Test: భారత్‌తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
- MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
- MS Dhoni-Sakshi: కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే.. ఎంఎస్ ధోనీ కొత్త ప్రయాణంపై సాక్షి ఆసక్తికర పోస్ట్!
- CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
ఎంఎస్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధం ఐపీఎల్ ప్రారంభమైన 2008లో మొదలైంది. తొలి ఐపీఎల్ వేలంలో ఐకాన్ ప్లేయర్ హోదాను తీసుకోకుండా వేలంలో తన విలువను నిర్ణయించుకునేందుకు ధోనీ సిద్ధమయ్యాడు. అప్పట్లో ఎన్. శ్రీనివాసన్ ఆయనను 1.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తొలి వేలంలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ఆ తర్వాత సీఎస్కేకు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించి జట్టును విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్. అశ్విన్‌ను పవర్‌ప్లేలో కొత్త బంతితో బౌలింగ్‌కు దించడం, కీరన్ పొలార్డ్ కోసం లాంగ్ ఆన్ స్థానంలో ప్రత్యేక ఫీల్డింగ్ వ్యూహాన్ని అమలు చేయడం వంటి నిర్ణయాలతో తన నాయకత్వ శైలిని చాటుకున్నాడు.
స్పాట్ ఫిక్సింగ్ వివాదం నేపథ్యంలో సీఎస్కే రెండేళ్ల నిషేధానికి గురైనప్పుడు ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడాడు. 2018లో చెన్నై జట్టు తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చిన తర్వాత కూడా ధోనీ నాయకత్వంలో టైటిల్ సాధించింది. ఈ క్రమంలో ధోనీ, సీఎస్కే మధ్య అనుబంధం అభిమానులకు ప్రత్యేకంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న మార్పులపై స్పందిస్తూ.. ‘ఎంఎస్ ధోనీ లేకుండా సీఎస్కే లేదు’ అని ఎన్. శ్రీనివాసన్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2020 ఆగస్టులోనే వీడ్కోలు పలికిన ధోనీ.. ఆ తర్వాత కూడా సీఎస్కే తరఫున ఐపీఎల్లో కొనసాగాడు. 2026 సీజన్లో గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్ 2027లో మెంటర్‌గా సీఎస్కేకు సేవలు అందించనున్నాడు. జట్టు పునర్నిర్మాణంలోనూ, యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలోనూ అతడి అనుభవం ఉపయోగపడనుంది.
తాజావార్తలు
-
MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
-
Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
-
IND vs NZ 1st Test: భారత్‌తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..