MS Dhoni-Sakshi: కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే.. ఎంఎస్ ధోనీ కొత్త ప్రయాణంపై సాక్షి ఆసక్తికర పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sakshi Emotional Post After MS Dhoni IPL Retirement: ఆరేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. ఇప్పుడు ఐపీఎల్‌కు టాటా చెప్పాడు. 2008లో ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఆడుతున్న మహీ.. 45 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలకడంతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ధోనీ సతీమణి సాక్షి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇన్నేళ్లుగా ధోనీకి అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయన కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు చెప్పారు. ‘మహీ.. నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నా’ అంటూ తన ప్రేమను చాటుకున్నారు.
సాక్షి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకృతి అందాల మధ్య కొండపై నిలబడి ఉన్న ఎంఎస్ ధోనీ ఫొటోను షేర్ చేశారు. దానికి భావోద్వేగపూరితమైన క్యాప్షన్ జోడించారు. ‘కొత్త, అందమైన అధ్యాయాలు ప్రారంభం కావాలంటే.. కొన్ని పాత అధ్యాయాలకు ముగింపు పలకాల్సిందే. ఇన్నేళ్లుగా మహీని ప్రేమించిన, మద్దతుగా నిలిచిన, నమ్మిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీలో కొందరు వ్యక్తిగతంగా తెలిసి ఉండొచ్చు.. మరికొందరు తెలియకపోవచ్చు. కానీ మీరందించిన ప్రేమకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. కొత్త ఆరంభాలు, కొత్త ప్రయాణాలు, మరెన్నో మధుర జ్ఞాపకాలకు స్వాగతం. మహీ.. నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నా. ఎప్పటికీ. లవ్ యూ’ అని సాక్షి పేర్కొన్నారు.
Also Read
- CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
- SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
- MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
- IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
సాక్షి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంఎస్ ధోనీకి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆటగాడిగా ధోనీ ప్రయాణం ముగిసినా.. సీఎస్కేతో ఆయన బంధం కొనసాగనుండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ధోనీని తమ జట్టు మెంటర్‌గా నియమిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. దీంతో ఐపీఎల్లో ఆటగాడిగా ఆయన 19 ఏళ్ల ప్రయాణానికి తెరపడినట్లయింది. 2008లో ఐపీఎల్ తొలి సీజన్‌తో ప్రారంభమైన ధోనీ ప్రస్థానం.. ఎన్నో రికార్డులు, చిరస్మరణీయ విజయాలతో సాగింది. సీఎస్కే తరఫున 16 సీజన్లలో ఆడిన ఆయన.. జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఎంఎస్ ధోనీ సారథ్యంలో సీఎస్కే 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నాయకుడిగా, మ్యాచ్ ఫినిషర్‌గా, జట్టును ముందుండి నడిపించిన ఆటగాడిగా ధోనీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మెంటర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. జట్టుకు తన అనుభవాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించనున్నాడు. ఆటగాడిగా మైదానంలో ధోనీని చూడలేకపోయినా.. మెంటర్‌గా సీఎస్కేతో ఆయన అనుబంధం కొనసాగనుంది. ఈ కొత్త పాత్రలోనూ మహీ తనదైన ముద్ర వేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
MS Dhoni-Sakshi: కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే.. ఎంఎస్ ధోనీ కొత్త ప్రయాణంపై సాక్షి ఆసక్తికర పోస్ట్!
-
AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
-
RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
-
Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. ‘కాక’ సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
-
CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!