IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!
- ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్
- ఐపీఎల్ 2026 మొత్తానికి ధోనీ దూరం
- ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు చెప్పే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజం, సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026లో మొదటి రెండు వారాలకు దూరమయ్యాడు. ఇదంతా తెలిసిన విషయమే.. తాజాగా ఓ షాకింగ్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లెజెండరీ క్రికెటర్ ధోనీ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశముందని సమాచారం. అంతేకాదు ఇదే మహీకి చివరి సీజన్ అని కూడా అంటున్నారు. దీనిపై సీఎస్‌కే లేదా ధోనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
కొన్ని రోజుల క్రితం సీఎస్‌కే ప్రాక్టీస్ సెషన్‌లో ఎంఎస్ ధోనీ గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన ఆయనకు వైద్యులు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మొదట ఇది చిన్న గాయమేనని భావించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం మహీకి అయిన గాయం పెద్దదే అని తెలుస్తోంది. గాయం కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే చెన్నై జట్టుకు మాత్రమే కాకుండా ధోనీ అభిమానులకు కూడా షాకింగ్ న్యూస్ అవుతుంది.
Also Read
- Japan Squad: భారత్‌తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
- ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్‌మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
Also Read: Maoist Narayana: అందుకే.. దేశ వ్యాప్తంగా పార్టీ కనుమరుగైంది!
మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇదే ఎంఎస్ ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా నెట్టింట మొదలైంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ (టెస్టులు, వన్డేలు, టీ20)కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐదేళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన కోసం చెన్నై మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!