Michael Vaughan: వరల్డ్ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!
- వరల్డ్ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికా
- దక్షిణాఫ్రికా బిగ్ మిస్టేక్ వల్లే టీమిండియాకు వరల్డ్ కప్
- మంచి అవకాశాన్ని దక్షిణాఫ్రికా మిస్ చేసుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 గురించి మాజీ ఇంగ్లండ్ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా టోర్నీలో అత్యంత ‘తెలివి తక్కువ జట్టు’ దక్షిణాఫ్రికానే అని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా చేసిన బిగ్ మిస్టేక్ వల్లే భారత్ చివరకు వరల్డ్ కప్‌ను గెలుచుకుందన్నారు. సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు ఓడిపోయి ఉంటే.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదన్నారు. పటిష్ట జట్టు భారత్‌ను వరల్డ్ కప్ నుంచి ముందే బయటకు పంపించి ఉండాల్సిందని, మంచి అవకాశాన్ని దక్షిణాఫ్రికా మిస్ చేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సూపర్-8 దశలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే.. సూర్య సేన తర్వాతి మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెస్టిండీస్ అప్పటికే జింబాబ్వేపై విజయం సాధించడంతో సమీకరణాలు మరింత క్లిష్టంగా మారాయి. అదే సమయంలో విండీస్‌ను దక్షిణాఫ్రికా ఓడించడం టోర్నీలో మలుపు తిరిగింది. దాంతో భారత్ అవకాశాలు మెరుగు కాగా.. జింబాంబ్వే, విండీస్‌పై గెలిచి సెమీస్ చేరింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించి.. టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ..
Also Read: IPL 2026: ఐపీఎల్ 2026 కష్టమే.. ఆందోళనలో ప్రాంఛైజీలు!
‘వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్ టోర్నీ నుంచి బయటికి వచ్చేది. కానీ సఫారీలు ఆ మ్యాచ్ గెలిచారు. దాంతో భారత్‌కు అవకాశం దక్కింది. పెద్ద టోర్నీల్లో గెలవాలంటే బలమైన జట్లను తొందరగా బయటికి పంపించడం చాలా ముఖ్యం. టోర్నీలో అత్యుత్తమ జట్టును త్వరగా పంపిస్తేనే కప్ గెలవడానికి అవకాశాలు పెరుగుతాయి. ఆ అవకాశాన్ని దక్షిణాఫ్రికా కోల్పోయింది. 2026 వరల్డ్ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే’ అని స్టిక్ టు క్రికెట్ పోడ్కాస్ట్లో మైకేల్ వాన్ అన్నారు. వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఐడెన్ కైల్ మార్క్రమ్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. సెమీఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!