CSK vs MI : ఈ ఎల్లో క్లాసిక్ లో గెలుపెవరిదో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు నెగ్గిన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ను అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. ఈ సీజన్ లో ఇదివరకే ఒకసారి జరిగిన ఎల్ క్లాసికోలో చెన్నైదే పైచేయి అయింది. వాంఖెడేలో చెన్నై.. ముంబైని మట్టికరిపించింది. ఇక నేడు ముంబై బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రోహిత్ సేన ఇవాళ మధ్యాహ్నం చెపాక్ స్టేడియంలో ధోని సేనతో తలపడనుంది. వాంఖెడే ఓటమికి ముంబై ఇప్పుడు చెపాక్ లో బదులు తీర్చుకుంటుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మ్యాచ్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఐపీఎల్ లో ధోనికి ఇదే చివరి సీజన్ (?) అన్న వాదనలు వినపడుతున్నాయి. దీనిపై ధోని ఎప్పటికప్పుడూ కొట్టిపారేస్తూనే ఉన్నా ఈ సీజన్ తర్వాత ధోని ఆడటం అనుమానమేనన్న వాదన బలంగా ఉంది.
Also Read : Karnataka Elections: ఖర్గేను చంపేందుకు బీజేపీ ప్లాన్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
అయితే ముంబై – చెన్నైలు ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరుకుంటే మాత్రం మళ్లీ మరో రసవత్తర పోరును చూసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి దాదాపు అన్ని జట్లూ 9 మ్యాచ్ లు పూర్తి చేసుకుని పది మ్యాచ్ లు కూడా ఆడాయి. పాయింట్ల పట్టికలో చెన్నై.. 10 మ్యాచ్ లలో ఐదు గెలిచి ఐదింట ఓడి మూడోస్థానంలో ఉంది. చెన్నై ప్లేఆఫ్స్ కు చేరడం పెద్ద కష్టమేమీ కాదు. తర్వాత ఆడబోయే నాలుగింట్లో రెండు గెలిచినా ఆ జట్టుకు ఈజీగా ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. ముంబై కూడా దాదాపు ఇదే తరహలో ఉంది. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన ఐదు గెలిచి నాలుగింట్లో ఓడింది. ప్లేఆఫ్స్ చేరేందుకు ఆ జట్టుకు ఆర్సీబీ, పంజాబ్, రాజస్తాన్ లు అడ్డుతగలొచ్చు. ముంబైతో పాటు పైన పేర్కొన్న టీమ్ లు మరో రెండు మ్యాచ్ లు ఆడితే గానీ రోహిత్ సేన ప్లేఆఫ్స్ అవకాశాల గురించి చెప్పలేం. ముంబై – చెన్నైలలో ఏ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకున్నా వచ్చే సీజన్ లో ధోని – రోహిత్ ల ఎల్ క్లాసికో ను చూడటం డౌటే.
Also Read : Today Business Headlines 06-05-23: రైల్వే ప్రింటింగ్ ప్రెస్ క్లోజ్. మరిన్ని వార్తలు
ధోనితో పాటు వచ్చే సీజన్ లో రోహిత్.. ముంబైని నడిపిస్తాడా..? అన్నది అనుమానంగా మారింది. భారత్ లో అక్టోబర్ నుంచి జరిగే వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ టీమిండియాకు గుడ్ బాయ్ చెప్పనున్నాడని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. రోహిత్ తప్పుకోకపోయినా ఇప్పటికే బీసీసీఐ టీ20లలో అతడిని పక్కనబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ ఐపీఎల్ లో ఫిట్నెస్, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడు. గతంలో హిట్‌మ్యాన్ లో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదన్నది బహిరంగ వినిపిస్తున్న టాక్.
ఈ నేపథ్యంలో రోహిత్ కూడా వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడినా ప్లేయర్ గా తప్ప సారథిగా ఉండేది అనుమానమే. ఈ అనుమానాలే నిజమైతే కెప్టెన్లుగా రోహిత్ – ధోనిలకు ఇదే చివరి ‘ఎల్ క్లాసికో’ కానుంది. ముంబై – చెన్నై మధ్య ఇప్పటివరకు 35 మ్యాచ్ లు జరుగగా ఇందులో 20 సార్లు ముంబై.. 15 సార్లు చెన్నై నెగ్గింది. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు లీగ్ దశలో 26 సార్లు తలపడ్డాయి. ఇందులో 15 సార్లు ముంబై.. 11 సార్లు చెన్నై గెలిచింది.

తాజావార్తలు
-
India First Hydrogen Train: భారత్ తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. గంటకు 120 కిమీ వేగంతో పరుగులు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్‌మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!