ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు నెగ్గిన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ను అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. ఈ సీజన్ లో ఇదివరకే ఒకసారి జరిగిన ఎల్ క్లాసికోలో చెన్నైదే పైచేయి అయింది. వాంఖెడేలో చెన్నై.. ముంబైని మట్టికరిపించింది. ఇక నేడు ముంబై బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది.