క్రికెట్ ఆడాలంటే.. ప్రతి ఒక్క ప్లేయర్ ఎంతో ఫిట్‌గా ఉండాలి. మైదానంలో గంటల తరబడి బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్.. ఏది చేయాలన్నా ఫిట్‌నెస్ చాలా అవసరం. ప్రస్తుతం పురుష, మహిళా ప్లేయర్స్ అందరూ ఫిట్‌గా ఉండడమే కాదు.. సిక్స్ ప్యాక్‌లు కూడా చేస్తున్నారు. అయితే ఓ మహిళా ప్లేయర్ మాత్రం 2022లో రిటైర్మెంట్ ఇచ్చినా, 100 కేజీలకు పైగా బరువు ఉన్నా.. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో మాత్రం దూసుకుపోతోంది. ఆమె ఎవరో కాదు.. దక్షిణాఫ్రికా మహి ప్లేయర్ ‘లిజెలీ లీ’. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో చర్చకు కేంద్రబిందువైంది.
డబ్ల్యూపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున లిజెలీ లీ ఆడుతోంది. షినెలీ హెన్రీ బౌలింగ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ అమేలియా కెర్ షాట్ ఆడగా. బంతి బ్యాట్‌ను తాకి వికెట్ల వెనక్కి దూసుకెళ్లింది. కీపర్ లిజెలీ డైవ్ చేస్తూ.. ఊహించని రీతిలో క్యాచ్ అందుకుంది. లిజెలీ అద్భుత క్యాచ్‌కు స్టేడియం మొత్తం హోరెత్తింది. డబ్ల్యూపీఎల్ 2026లో ఇప్పటివరకు చూసిన ఉత్తమ వికెట్‌కీపింగ్ మూమెంట్స్‌లో ఇదొకటిగా నిలిచింది. అనంతరం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లిజెలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. 54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో 86 రన్స్ చేసింది. లిజెలీ షాట్ కొట్టిన ప్రతిసారీ స్టేడియంలోని ఫాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. కామెంటేటర్లు కూడా ఆమె ఆటకు ఫిదా అయిపోయారు. అయితే ఫాన్స్ ఇంతలా ఎంజాయ్ చేయడానికి కారణం మాత్రం ఆమె భారీ కాయమే. 100 కేజీలకు పైగా బరువు ఉన్నా.. మైదానంలో ఎంతో చురుగ్గా కదులుతున్నారు.
Also Read: Alyssa Healy Retirement: షాకింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ రిటైర్మెంట్!
2013లో దక్షిణాఫ్రికా దేశవాళీ మహిళల టీ20 లీగ్ ద్వారా లిజెలీ లీ వెలుగులోకి వచ్చింది. ఓ మ్యాచ్‌లో 84 బంతుల్లోనే 169 పరుగులు చేయడంతో ఆమె పేరు మార్మోగింది. ఆ రోజుల్లోనే, అందులోనూ మహిళల క్రికెట్లో అలాంటి సునామి ఇన్నింగ్స్ అంటే మాటలు కాదు. ఆ తర్వాతి ఏడాదే దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చేసింది. దాదాపు 8 ఏళ్ల పాటు సఫారీ జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా ఉంది. 100 వన్డేల్లో 3315 పరుగులు, 82 టీ20ల్లో 1896 పరుగులు చేసింది. ఇక రెండు టెస్టుల్లో 42 రన్స్ చేసింది. బిగ్ బాష్‌లో 104 మ్యాచ్‌ల్లో 2770 పరుగులు చేసింది. 2022లో ఆటకు వీడ్కోలు పలికిన లిజెలీ.. బిడ్డ పుట్టాక క్రికెట్‌కు విరామం ఇచ్చింది. తల్లి అయ్యాక ఆమె మరింత బరువు పెరిగింది. దాంతో లిజెలీ ఇక క్రికెట్ ఆడదని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మళ్లీ బిగ్ బాష్‌లోకి పునరాగమనం చేసింది. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ 2026లో ఆడుతోంది.