Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- మెస్సీ తండ్రి జార్జ్ కన్నుమూత
- అర్జెంటీనా, స్పెయిన్ మీడియా సంస్థలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూశారు. 68 ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు అర్జెంటీనా, స్పెయిన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే మెస్సీ కుటుంబం మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అర్జెంటీనాలోని మెస్సీ స్వస్థలమైన రొసారియోలో జార్జ్ మెస్సీ మృతి చెందినట్లు సమాచారం. మెస్సీ ఫుట్‌బాల్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో జార్జ్ కీలక పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి తన కుమారుడి కెరీర్‌కు అండగా నిలుస్తూ.. అతడిని ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థాయికి తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
మెస్సీ తొలిసారిగా ఆడిన క్లబ్ న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ జార్జ్ మెస్సీ మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపింది. 68 ఏళ్ల వయసులో రొసారియోలో జార్జ్ కన్నుమూశారని పేర్కొంటూ.. మెస్సీ కుటుంబానికి సానుభూతి తెలిపింది.
లియోనెల్ మెస్సీ కెరీర్లో జార్జ్ ఒక బలమైన స్తంభంలా నిలిచారని క్లబ్ పేర్కొంది. విజన్, క్రమశిక్షణ, ఆప్యాయతతో తన కుమారుడి కెరీర్‌కు ఆయన అండగా నిలిచారని తెలిపింది. చిన్ననాటి నుంచి ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యున్నత స్థాయికి చేరుకునే వరకు మెస్సీ ప్రతి అడుగులోనూ జార్జ్ మద్దతు కీలకంగా ఉందని పేర్కొంది. తన కుమారుడికి న్యూవెల్స్ క్లబ్ రంగులను ప్రేమించడం నేర్పినందుకు జార్జ్‌కు ధన్యవాదాలు తెలిపిన క్లబ్.. ఆయన భార్య సెలియా కుచిట్టినీ, కుమారులు లియోనెల్, రోడ్రిగో, మాటియాస్, కుమార్తె మారియా సోల్‌తో పాటు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.
జార్జ్ మెస్సీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్ సమయంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వెలువడ్డాయి. అర్జెంటీనా జట్టు అల్జీరియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ సాధించిన సమయంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జార్జ్ ఆరోగ్యం సరిగా లేదనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత మెస్సీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జార్జ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపింది. అయితే తాజాగా ఆయన మృతి చెందినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!