Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్‌గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
- వ్యాక్సిన్ కింగ్ నుంచి స్టీల్ కింగ్ చేతికి ఆర్ఆర్ జట్టు
- ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కొత్త శకం
- ఇక రాజస్థాన్ రాయల్స్ స్టీల్ కింగ్ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Royals Owner: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలో, ఒక భారీ బిజినెస్ డీల్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కుల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త బాస్ వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టీల్ దిగ్గజం, భారత సంతతి బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ కుటుంబం ఈ జట్టును కొనుగోలు చేసింది. సుమారు 1.65 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,660 కోట్లు) భారీ వ్యయంతో ఈ ఒప్పందం కుదిరింది.
ఒప్పందం వివరాలు ఇవే..
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ, వ్యాక్సిన్ కింగ్ అదర్ పూనావాలా నుంచి మిట్టల్ కుటుంబం ఈ జట్టులోని మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌లో 75% మెజారిటీ వాటాను మిట్టల్ కుటుంబం దక్కించుకుంది. ఇదే సమయంలో అదర్ పూనావాలా ఈ జట్టులో సుమారు 18% వాటాను తన వద్దే ఉంచుకోనున్నారు. మిగిలిన వాటా ఇతర ఇన్వెస్టర్ల వద్ద ఉంటుంది. మనోజ్ బాడ్లే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా గ్రూప్ నుంచి ఈ నియంత్రణ వాటాను కొనుగోలు చేసేందుకు బిసిసిఐ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంది. 2026 మూడవ త్రైమాసికం నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
Also Read
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
సొంత గడ్డపై మమకారమే కారణం
ఈ భారీ ఇన్వెస్ట్‌మెంట్ గురించి లక్ష్మీ మిట్టల్ స్పందిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. “నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్థాన్‌కు చెందినది, అందుకే నేను రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగం కావాలని కోరుకున్నాను. ఈ అద్భుతమైన జట్టు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం తర్వాత రాజస్థాన్ రాయల్స్ బోర్డులో కీలక మార్పులు జరగనున్నాయి. లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్ (కుమారుడు), వనిషా మిట్టల్-భాటియా (కుమార్తె), అదర్ పూనావాలా, మనోజ్ మిట్టల్ కొత్త సభ్యులుగా చేరబోతున్నారు.
స్టీల్ కింగ్ ప్రస్థానం..
రాజస్థాన్‌లోని సదుల్‌పూర్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్, ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశపు 4వ అత్యంత ధనవంతుడు. ఆయన నికర ఆస్తి విలువ 28.4 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు సంస్థ ‘ఆర్సెలార్ మిట్టల్’ ద్వారా ఆయన తన సామ్రాజ్యాన్ని నిర్మించారు. 1995లో లండన్ వెళ్లిన ఆయన, ఇటీవలే యూకేను విడిచి దుబాయ్‌కు మారాలని నిర్ణయించుకోవడం గమనార్హం. మొదటి సీజన్ (2008) విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు స్టీల్ కింగ్ చేతుల్లోకి వెళ్లడంతో ఫ్రాంచైజీ మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?