Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kusal Mendis Happy About Sri Lanka beat England: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక ఊహించని విజయాన్ని అందుకుంది. 430 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో బంతి ఉండగానే 8 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. మొదట ఇంగ్లండ్ 4 వికెట్లకు 429 పరుగుల భారీ స్కోరు చేసింది. లంక 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంపై శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమపై తాము నమ్మకం ఉంచారని, అందరూ బాధ్యత తీసుకొని ఆడటం వల్లే భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగామని తెలిపాడు. కెప్టెన్‌గా ఈ ఇన్నింగ్స్‌ను తాను ఎంతో ఆస్వాదించానని మెండిస్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం కుశాల్ మెండిస్ మాట్లాడుతూ.. ‘మేము టాస్ గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్నే ఎంచుకున్నాము. మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అనుకూలంగా ఉంటుందని భావించా. ప్రతి మ్యాచ్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు మంచి ప్రాంతాల్లో బంతులు వేసి ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలింగ్ విభాగం తమ బాధ్యతను సమర్థంగా నిర్వహించింది. అనంతరం బ్యాటర్లు అద్భుతంగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. మా ఆటపై చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడారు’ అని తెలిపాడు.
Also Read
- Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
- WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
- Sanju Samson: అభిషేక్ శర్మతో మాట్లాడాను.. ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. విధ్వంసకర ఇన్నింగ్స్‌గా మార్చాను..
- Highest Successful Run Chases: వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే.!
‘430 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో కోచ్‌తో కలిసి ముందుగానే వ్యూహం రచించాం. మొదట బ్యాటర్లు కొన్ని ఓవర్లు సాధారణంగా ఆడాలని, ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా దసున్ శనకను ముందుగానే బ్యాటింగ్‌కు పంపాము. అవిష్క ఫెర్నాండో, పవన్ రత్నాయకే, దసున్ శనక, జనిత్ లియనగే కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అర్థం చేసుకొని బాధ్యత తీసుకున్నారు. జట్టు విజయంలో అందరి కృషి ఉంది’ అని లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ ప్రశంసించాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఒత్తిడికి గురయ్యారా? అనే ప్రశ్నకు కుశాల్ మెండిస్ స్పందిస్తూ.. జట్టులోని ప్రతి ఒక్కరికీ విజయం సాధించగలమనే నమ్మకం ఉందని చెప్పాడు. ‘ప్రతి ఒక్కరూ మనం ఈ లక్ష్యాన్ని ఛేదించగలమని నమ్మారు. ప్రతిరోజూ జరిగే సమావేశాల్లో ఆటగాళ్ల వ్యక్తిత్వం, బాధ్యత, ఆత్మవిశ్వాసం గురించి చర్చించుకుంటాము. అందరికీ ఎలా ఆడాలో తెలుసు. ఈ రోజు మనం పరుగులు సాధించగలమని నిరూపించుకున్నాం. కెప్టెన్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అద్భుత విజయాన్ని చిన్నపాటి వేడుకతో జరుపుకుంటాం. తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి. భారీ లక్ష్యాన్ని ఛేదించి సాధించిన ఈ విజయం శ్రీలంక జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది’ అని కుశాల్ మెండిస్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
-
Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
-
WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
-
Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 ఫోన్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం, అక్టోబర్ 30న లాంచ్!
-
Trump: ఇరాన్‌ను చిత్తుగా ఓడించాం.. ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!