Sanju Samson: అభిషేక్ శర్మతో మాట్లాడాను.. ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. విధ్వంసకర ఇన్నింగ్స్‌గా మార్చాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 19.4 ఓవర్లలోనే ఛేదించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో మెరిసిన సంజూ శామ్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన అద్భుత ప్రదర్శన, జట్టు విజయం గురించి ఆయన ఇలా మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను గెలిచిన ఈ సందర్భం చాలా ప్రత్యేకమైనది. మనం చేసే సహకారం జట్టుకు విజయాన్ని అందించినప్పుడు ఆ అనుభూతే వేరు. ఈ రోజు మ్యాచ్ గెలిచేందుకు జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారు. ఇది సంపూర్ణంగా ఒక టీమ్ గేమ్. ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
అభిషేక్ శర్మతో కలిసి మైదానంలో అడుగు పెట్టాక మా మధ్య చాలా సంభాషణలు జరుగుతుంటాయి, కానీ అందులో పెద్దగా విశ్లేషణలేమీ ఉండవని సంజూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా బంతి ఏ విధంగా వస్తుంది.. దానిని ఎలా బౌండరీకి దాటించాలనే ఆలోచనతోనే ఉంటామన్నారు. ఇద్దరం కలిసి సంభాషించుకున్న తర్వాత బంతి టెక్నిక్ తెలిసింది. బంతి నేరుగా బ్యాట్ పైకి వస్తున్నట్లు గమనించామని.. ఈ వ్యూహం మాకు బాగా పనిచేసిందని అన్నారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. నేను, అభి పవర్ ప్లేలో సరైన షేప్ కొనసాగిస్తూ చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడాలని భావించాం. పవర్ ప్లేలోనే మాకు అద్భుతమైన ఆరంభం లభించడంతో, మ్యాచ్ ఫలితాన్ని మొదట్లోనే తేల్చేయవచ్చని మాకు అనిపించింది. 6 ఓవర్లలోనే 90 పైచిలుకు పరుగులు రావడం అత్యుత్తమ ఆరంభం. అందుకే మేము ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాలనుకున్నామని సక్సెస్ సీక్రెట్‌ను చెప్పాడు.
Also Read
- Highest Successful Run Chases: వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే.!
- ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
- SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
Sanju Samson: అభిషేక్ శర్మతో మాట్లాడాను.. ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. విధ్వంసకర ఇన్నింగ్స్‌గా మార్చాను..
-
Highest Successful Run Chases: వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే.!
-
Tibet Earthquake: 7 తీవ్రతతో టిబెట్‌లో భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు
-
ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!