KL Rahul ruled out of T20 series vs West Indies: శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకి ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టాపార్డర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇటీవల కొవిడ్ బారిన పడిన అతడు, ప్రస్తుతం కోలుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. కానీ.. అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన బీసీసీఐ మెడికల్ కమిటీ, మరో వారం రోజుల పాటు విశ్రాంతి తప్పదని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో.. విండీస్ టీ20 సిరీస్‌కు అతడు దూరం కావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు కేఎల్ రాహుల్ గాయపడటంతో, జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స చేయించుకున్నాడు. చికిత్స అనంతరం భారత్‌కి తిరిగొచ్చి.. జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో అతడు పూర్తిగా కోలుకున్నాడని అనుకుంటున్న తరుణంలోనే.. కరోనా బారిన పడ్డాడు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు తగిన సమయం లేదు. అందుకే.. విండీస్ టీ20 సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఇది టీమిండియాకు, క్రికెట్ అభిమానులకు చేదువార్తే! ఎందుకంటే.. రాహుల్ అద్భుతమైన బ్యాట్స్‌మన్. క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడుగా ఆడకుండా.. ఆచితూచి రాణిస్తున్నాడు. కానీ, ఒక్కసారి కుదురుకుంటే మాత్రం ప్రత్యర్థి జట్టుకి ముచ్చెమటలు పట్టిస్తాడు.
కాగా.. శుక్రవారం (జూలై 29) నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ మొదలు కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విండీస్‌కు చేరుకుంది. ఆల్రెడీ వన్డే సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. బుధవారం జరగనున్న మ్యాచ్ కూడా గెలిచి, క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. దీంతోపాటు టీ20 సిరీస్ నెగ్గాలని కసితో ఉంది. జట్టు కూడా పటిష్టంగానే ఉండటంతో, కివీస్‌పై భారత్ పైచేయి సాధించడం ఖాయమని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.