KL Rahul History: తొలి భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర.. దిగ్గజాల వల్లే కాలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul SENA Record: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నింటిలోనూ ఓపెనర్‌గా హాఫ్ సెంచరీ (50కి పైగా పరుగులు) చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేయడంతో రాహుల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ రికార్డు దిగ్గజాలు సునీల్ గవాస్కర్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వల్ల కూడా కాలేదు. రాహుల్ నిలకడకు ఈ ఫీట్ ఓ నిదర్శనం అనే చెప్పాలి.
టెస్టు క్రికెట్లో కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు సంప్రదాయ ఫార్మాట్లో 12 సెంచరీలు సాధించగా.. అందులో ఏడు సెంచరీలు SENA దేశాల్లోనే నమోదు చేశాడు. ఓపెనర్‌గా 66 మ్యాచ్‌ల్లో 105 ఇన్నింగ్స్ ఆడిన రాహుల్.. 38.86 సగటుతో 3,886 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 50.75గా ఉంది. అత్యధిక స్కోరు 199 పరుగులు. ఓపెనర్‌గా 11 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు సాధించాడు. అయితే న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటివరకు రాహుల్ టెస్టు సెంచరీ నమోదు చేయలేదు. ప్రస్తుత సిరీస్‌లో ఆ లోటును భర్తీ చేసి మూడు అంకెల స్కోరు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు.
Also Read
- IND vs NZ 1st Test: కివీస్‌కు దీటుగా భారత్ బదులు.. జైస్వాల్ సెంచరీ మిస్, రాహుల్ హాఫ్ సెంచరీ!
- Mohammed Siraj: తప్పించేందుకు కుట్రలు చేశారు.. ఇది ట్రైలర్ మాత్రమే.. సిరాజ్ భవిష్యత్తుపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!
- MS Dhoni: "ధోనీ ఆట, హెయిర్‌స్టైల్‌కు నాటి పాకిస్థాన్ అధ్యక్షుడు ఫిదా".. 20 ఏళ్ల నాటి ఘటనను గుర్తుచేసిన రాజీవ్ శుక్లా
- Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
టెస్టుల్లో భారత ఓపెనర్‌గా లోకేష్ రాహుల్‌కు ఇది 30వ ఫిఫ్టీ. దీంతో ఈ జాబితాలో రాహుల్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. సునీల్ గవాస్కర్ (75) అగ్ర స్థానంలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ (51), గౌతమ్ గంభీర్ (31)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ (17) రోహిత్ శర్మతో కలిసి ఐదో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్ (24) అగ్రస్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా (23), యశస్వి జైస్వాల్ (21), శుభ్‌మన్ గిల్ (19) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (52), దేవదత్ పడిక్కల్ (16)లు ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (85) కీలక ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులు చేయగా.. భారత్ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.
తాజావార్తలు
-
KL Rahul History: తొలి భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర.. దిగ్గజాల వల్లే కాలేదు!
-
Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
-
Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
-
Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
-
MLA Adinarayana Reddy: రాజీనామాపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!