ఐపీఎల్ సీజన్ 2022 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని విధంగా జట్ల మధ్య పోటీ జరుగుతోంది. ఐపీఎల్ సీజన్లలోనే ఈ సీజన్ ప్రత్యేకంగా నిలుస్తుందని కొందరు క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే నేడు ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌ను ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది.
డీసీ అరంగేట్రం బౌలర్ చేతన్ సకారియా బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ (7 బంతుల్లో 3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నితీశ్ రాణా (33 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 57), శ్రేయస్ (37 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.