NTV Telugu Site icon

కోహ్లీ చేసింది మంచి పని కాదు: కపిల్ దేవ్

నిన్న విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ తో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంతోషంగా లేడు. అయితే ప్రపంచ కప్ కు ముందు కోహ్లీ టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకున్నపుడు… టీ20లతో పాటు టెస్టులు, వన్డేలకు కూడా కెప్టెన్‌గా కోహ్లీనే కొనసాగమని కోరామని, కొన్ని రోజుల కిందట తాను వ్యక్తిగతంగా కోరానని గంగూలీ ప్రకటించాడు. కానీ దాదా కామెంట్స్‌ కి విరుద్దంగా కోహ్లీ బాంబ్‌ పేల్చడం… ఇండియన్ క్రికెట్‌ టీంలో సంచలనంగా మారింది. నేను తప్పుకుంటా అని చెప్పినప్పుడు టీ 20 కెప్టెన్‌గా కొనసాగమని తనను అడగలేదని కోహ్లీ వెల్లడించాడు. దాంతో ఇన్నాళ్లుగా బీసీసీఐ బాస్‌ గంగూలి, కోహ్లీల మధ్య నడుస్తున్న కోల్డ్‌ వార్‌ కాస్తా బట్టబయలైంది.

Read Also : ఆ తేడా ఏంటి… దాదానే కోహ్లీని అడగాలి…!

అయితే ఈ విషయంపై కపిల్ దేవ్ మాట్లాడుతూ… ప్రస్తుతం టీం ఇండియా వెళ్తున్న దక్షిణాఫ్రికా పర్యటనపై అందరూ దృష్టి సారించాలని అన్నాడు. ఈ సమయంలో ఒకరినొకరు అనుకోవడం మంచిది కాదు. బీసీసీఐ బోర్డు ప్రెసిడెంట్ పదవి మాత్రమే కాదు.. టీం ఇండియా కెప్టెన్ పదవి కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి బహిరంగంగా ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం… అది గంగూలీ అయినా, కోహ్లీ అయినా మంచిదని నేను అనుకోను’’ అంటూ కపిల్ చెప్పాడు. అలాగే ఇప్పుడు ఈ పరిస్థితిని నియంత్రించాలని… మన దేశం గురించి ఆలోచించాలని కోరాడు.