కరోనా ఆపలేకపోయింది.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఐపీఎల్‌ను వెంటాడుతూనే ఉంది… తాజాగా, సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. అతడిని ఐసోలేషన్‌లో పెట్టారు.. నటరాజన్‌తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో ప్లేయర్ విజయ్ శంకర్.. టీమ్ మేనేజర్ విజయ్‌కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామిని కూడా ఐసోలేషన్‌కు తరలించారు.. అయితే, కరోనా కలకలంతో ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. కానీ, మ్యాచ్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని బీసీసీఐ ప్రకటించింది. ఇక, అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్‌కు చేరాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇప్పటికే సన్‌రైజర్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. ఇక, ఈ మ్యాచ్‌లో వార్నర్, సాహ, పాండే విలియమ్సన్ (కెప్టెన్), జాదవ్, హోల్డర్, సమద్, ఆర్ ఖాన్, బి కుమార్, ఎస్.శర్మ, కె.అహ్మద్ తో సన్‌రైజర్స్ బరిలోకి దిగగా.. శిఖర్ ధావన్, పి.షా, ఎస్.అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఎమ్.స్టోనిస్, ఎస్.హెట్‌మెయిర్, ఆర్.పటేల్, ఆర్.అశ్విన్, కె.రబడ, ఏ.ఖాన్ తో మ్యాచ్ ఆడుతోంది ఢిల్లీ కేపిటల్స్.
Also Read
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!