NTV Telugu Site icon

కరోనా ఆపలేకపోయింది.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్..

కరోనా మహమ్మారి ఐపీఎల్‌ను వెంటాడుతూనే ఉంది… తాజాగా, స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. అతడిని ఐసోలేషన్‌లో పెట్టారు.. నటరాజన్‌తో పాటు అత‌నితో స‌న్నిహితంగా ఉన్న మ‌రో ప్లేయ‌ర్ విజ‌య్ శంక‌ర్‌.. టీమ్ మేనేజ‌ర్ విజ‌య్‌కుమార్‌, ఫిజియో శ్యామ్ సుంద‌ర్‌, డాక్టర్ అంజ‌నా వ‌న్నన్‌, లాజిస్టిక్స్ మేనేజ‌ర్ తుషార్ ఖేడ్కర్‌, నెట్ బౌల‌ర్ పెరియ‌సామిని కూడా ఐసోలేషన్‌కు తరలించారు.. అయితే, కరోనా కలకలంతో ఐపీఎల్‌లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. కానీ, మ్యాచ్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని బీసీసీఐ ప్రకటించింది. ఇక, అబుదాబి వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్‌కు చేరాలంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ ప్రతి మ్యాచ్ గెల‌వాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇప్పటికే స‌న్‌రైజ‌ర్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. ఇక, ఈ మ్యాచ్‌లో వార్నర్, సాహ, పాండే విలియమ్సన్ (కెప్టెన్), జాదవ్, హోల్డర్, సమద్, ఆర్ ఖాన్, బి కుమార్, ఎస్.శర్మ, కె.అహ్మద్ తో సన్‌రైజర్స్ బరిలోకి దిగగా.. శిఖర్ ధావన్, పి.షా, ఎస్.అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఎమ్.స్టోనిస్, ఎస్.హెట్‌మెయిర్, ఆర్.పటేల్, ఆర్.అశ్విన్, కె.రబడ, ఏ.ఖాన్ తో మ్యాచ్‌ ఆడుతోంది ఢిల్లీ కేపిటల్స్.