IPL 2022: స్వదేశానికి వెళ్తున్న కేన్ మామ.. ఆఖరి లీగ్ మ్యాచ్‌కు దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌పై సన్‌రైజర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 3 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖరి మ్యాచ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్రకటించింది.
Matthew Hayden: పరాగ్ అలా చేయడం కరెక్ట్ కాదు
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
విలియమ్సన్ స్వదేశం న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్లిపోతున్నాడు. తన కుటుంబంలోకి కొత్తగా రాబోతున్న బేబీకి స్వాగతం పలికేందుకు అతడు వెళ్తున్నాడు. అంతా మంచే జరగాలని తమ క్యాంప్ కోరుకుంటోంది అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రకటన విడుదల చేసింది. 2015లో సారాహ్ రహీమ్‌ను కేన్ విలియమ్సన్ వివాహం చేసుకోగా వీరికి 2020, డిసెంబరులో ఒక పాప కూడా జన్మించింది. త్వరలోనే రెండో బిడ్డకి రహీమ్ జన్మనివ్వబోతోంది. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండేందుకు విలియమ్సన్ స్వదేశానికి వెళ్తున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి కీలక మ్యాచ్‌లో విలియమ్సన్ స్థానంలో ఎవరు ఆడతారో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా భువనేశ్వర్ లేదా నికోలస్ పూరన్ బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!