NTV Telugu Site icon

భారత జట్టు ఎంపికపై పాక్ ఆటగాడు ప్రశంసలు…

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు కూడా చేరుకోకుండా వెనుదిరిగిన భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టును చూసి పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ సెలక్టర్ల పైన అలాగే బీసీసీఐ పైన ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. వారిని వచ్చే సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం సిద్ధం చేస్తుంది. అయితే ఇది చాలా మంది పని అని ఈ పాక్ ఆటగాడు తెలిపాడు. అలాగే ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ బయో బబుల్స్ లో ఉంది ఆడుతుండటం వల్ల… ఇలా ఆటగాళ్లకు విశ్రాంతిని ఇస్తే వారు కొంత రిలాక్స్ అవుతారని తెలిపాడు.