Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
- షూటింగ్లో భారత్‌కు మరో పతకం
- 50m రైఫిల్ 3 పొజిషన్స్‌లో రజతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamaljeet-Suruchi Win India’s Second Gold Medal: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కమల్జీత్, సురుచి సింగ్ జోడీ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించింది. 484.6 పాయింట్లతో ఆసియా రికార్డును నెలకొల్పిన ఈ జోడీ.. భారత్‌కు ఈ క్రీడల్లో రెండో స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో తొలి నుంచే కమల్జీత్- సురుచి జోడీ ఆధిక్యంలో కొనసాగింది. దక్షిణ కొరియా జోడీ చివరి దశలో ఒత్తిడి పెంచినప్పటికీ భారత షూటర్లు తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. భారత్ 484.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, దక్షిణ కొరియా 478.0 పాయింట్లతో రజత పతకం సాధించింది. ఇరాన్ 415.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత జోడీకి కొరియా కంటే 6.6 పాయింట్ల ఆధిక్యం లభించింది.
ఆసియా రికార్డుతో మెరుపు ప్రదర్శన
కమల్జీత్, సురుచి ఫైనల్లో 484.6 పాయింట్లు సాధించి ఏషియన్ గేమ్స్ రికార్డును నమోదు చేశారు. ఈ ప్రదర్శనతో భారత్‌కు షూటింగ్లో మరో కీలక విజయాన్ని అందించారు. క్వాలిఫికేషన్‌లోనూ ఈ జోడీ అద్భుతంగా రాణించింది. తొలి సిరీస్‌లో 196 పాయింట్లు సాధించిన వారు.. రెండో సిరీస్ ముగిసే సమయానికి 391 పాయింట్లకు చేరుకున్నారు. ఆ స్థిరమైన ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించి, చివరకు స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు.
Also Read
- Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
- IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..
- Aaryavir Sehwag: బ్యాటింగ్‌లో వీరవిహారం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ప్రపంచంలో సరికొత్త రికార్డు..
- Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత్‌కు రజతం
ఇదే సమయంలో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో కూడా భారత్ మరో పతకాన్ని సాధించింది. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్‌తో కూడిన భారత జట్టు మొత్తం 1762 పాయింట్లు సాధించి రజత పతకం గెలుచుకుంది. చైనా 1766 పాయింట్లతో స్వర్ణం సాధించగా, దక్షిణ కొరియా కాంస్య పతకాన్ని దక్కించుకుంది. క్వాలిఫికేషన్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 589, నీరజ్ కుమార్ 588, రుద్రాంక్ష్ పాటిల్ 585 పాయింట్లు సాధించారు.
వ్యక్తిగత ఫైనల్‌పై ఆసక్తి
టీమ్ ఈవెంట్ ముగిసిన నేపథ్యంలో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత పోటీలపై కూడా ఆసక్తి నెలకొంది. భారత షూటర్లలో అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు షూటర్లు వ్యక్తిగత ఫైనల్లో పోటీ పడనుండగా, రుద్రాంక్ష్ పాటిల్‌కు ఆ అవకాశం దక్కలేదు. ఏషియన్ గేమ్స్ 2026లో షూటింగ్ విభాగం నుంచి భారత్‌కు వరుసగా పతకాలు లభిస్తున్నాయి. కమల్జీత్- సురుచి జోడీ స్వర్ణంతో భారత్ తన పతకాల ఖాతాలో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది.
తాజావార్తలు
-
Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
-
Mouli : ‘దొంగ నా కొడకు’ టైటిల్‌పై సెన్సార్ కత్తెర.. ‘DNK’ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
-
CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
-
Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
-
IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?